TDP: కర్నూలు జిల్లా టీడీపీలో కుదుపు..! పార్టీకి కీలక నేతలు గుడ్‌బై..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: ఎన్నికల సమయంలో.. నేతలు పార్టీలు మారడం సర్వసాధారణమైన విషయమే.. ఒక పార్టీలో సీటు దక్కలేదని.. మరో పార్టీ గూటికి చేరడం.. ప్రతీ ఎన్నికల్లో చూస్తూనే ఉంటాం.. అయితే, ఈ సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి భారీ గండి పడుతుందనే ప్రచారం సాగుతోంది.. జనసేన, బీజేపీలతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తోంది తెలుగుదేశం పార్టీ.. పొత్తుల్లో భాగంగా కొందరు నేతలకు సీట్లు దక్కకపోతే.. మరికొన్ని స్థానాల్లో సీటు ఆశించినవారికి భంగపాటు తప్పలేదు. వాళ్లను కాదని మరో నేతకు సీటు కేటాయించడం కూడా ఆ పార్టీలో కుంపటి రాజేసింది.. అయితే, కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ గండి పడే అవకాశం ఉందంటున్నారు.. పార్టీలో కీలక నేతలుగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారట.
Read Also: Mudragada Vs Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో పలువురు కీలక నేతలు ఉన్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.. ఈ నెల 12వ తేదీన పలువురు టీడీపీ నేతలు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.. ఇప్పటికే వైసీపీతో టచ్ లోకి వెళ్లిపోయారట కొందరు నేతలు.. వారి దారిలోనే మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నారట.. 12వ తేదీన సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ, ఆలూరు మాజీ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం మల్లికార్జున, ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారట.. ఇక, రామసుబ్బారెడ్డి తో ఇప్పటికే చర్చలు జరిపారట మాజీ మంత్రి కేఈ ప్రభాకర్.. కానీ, కేఈ ప్రభాకర్ టీడీపీ వీడకుండా కేఈ కృష్ణమూర్తి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తురని తెలుస్తోంది.. మరోవైపు మంత్రాలయం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తిక్కారెడ్డి.. పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చలతో సంతృప్తి పడలేదు.. మంత్రాలయం అసెంబ్లీ టికెట్ పై ఇప్పటికీ పట్టు వీడడం లేదు తిక్కారెడ్డి.. ఈ నేపథ్యంలో.. తిక్కారెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్‌పై ఓ నిర్ణయానికి వస్తారనే ప్రచారం సాగుతోంది. మరి ఈ వలసలకు టీడీపీ చెక్ పెడుతుందా? లేదంటా కర్నూలు జిల్లాలో టీడీపీలో భారీ కుదుపు తప్పదా? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!