కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్ధతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. తనకు మద్దతుగా తెలిపేందుకు విచ్చేసిన యోగి ఆదిత్యానాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా.. కుత్బుల్లాపూర్ గడ్డమీద అడుగుపెట్టినందుకు వారికి శిరస్సు వంచి స్వాగతం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన లైవ్ డిబేట్‌లో మాటల యుద్ధం కాస్తా ఘర్షణకు దారి తీసింది.
కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆ మాజీ ఎమ్మెల్యే మనసు మార్పు కోరుకుంటుందా? బ్యాక్ టు పెవీలియన్ అని వచ్చేస్తారా? అనుచరుల మాటేంటి? మాజీ ఎమ్మెల్యే మాట వింటారా? రాం రాం చెబుతారా? ఇదే ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో ఆసక్తిగా మారింది. కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌వైపు చూస్తున్నారా? బీజేపీలో రాజకీయ భవిష్యత్ వెతుక్కుంటూ వెళ్లిన చాలా మంది కాంగ్రెస్ నాయకులు తిరిగి వెనక్కి వచ్చేయడానికి చూస్తున్నరనే చర్చ తెలంగాణలో జోరందుకుంది. ఇప్పటికే కొందరు బీజేపీకి గుడ్‌బై…
హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడిపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అటవీ శాఖ అధికారులు.. అటవీశాఖకు చెందిన కైసర్ నగర్ సర్వే నంబర్ 19లో ఉన్న భూమిని చదును చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అటవీశాఖ సెక్షన్ అధికారి శ్రీనివాస్ రెడ్డి… అటవీశాఖ సిబ్బందితో కూన జైకుమార్ గౌడ్ మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది.. అయితే, గాజులరామారం సర్కిల్ కైసర్ నగర్‌లో సర్వే నంబర్ 28లో తన సొంతభూమిలో…