హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడిపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అటవీ శాఖ అధికారులు.. అటవీశాఖకు చెందిన కైసర్ నగర్ సర్వే నంబర్ 19లో ఉన్న భూమిని చదును చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అటవీశాఖ సెక్షన్ అధికారి శ్రీనివాస్ రెడ్డి… అటవీశాఖ సిబ్బందితో కూన జైకుమార్ గౌడ్ మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది.. అయితే, గాజులరామారం సర్కిల్ కైసర్ నగర్‌లో సర్వే నంబర్ 28లో తన సొంతభూమిలో రెండు ఎకరాలు చదును చేస్తుండగా.. అటవీశాఖ అధికారులే అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు కూన జై కుమార్ గౌడ్.. ఈ వ్యవమారంపై ఫారెస్ట్ అధికారులపై ఆయన కూడా దుండిగల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.. ఇక, ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన దుండిగల్ పోలీసులు.. కేసు దర్యాప్తు ప్రారభించారు.