12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కారాల స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద పుష్కర పండగకు విడుదల చేసిన 35 కోట్ల రూపాయలు ఏర్పాట్లకు సరిపోవన్నారు.
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా 2025 తర్వాత.. ఇప్పుడు అందరి కళ్ళు మరో కుంభమేళాపై ఉన్నాయి. ఈ కుంభమేళా దక్షిణ భారతదేశంలో జరుగుతుంది. తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో 'మహామహం' (కుంభమేళా) నిర్వహిస్తారు. ఈ 'మహామహం'లో కూడా దేశం నలుమూలల నుంచి దాదాపు కోటి మంది భక్తులు పవిత్రమైన అమృత స్నానానికి వస్తారు. ఈ కుంభమేళా కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 'మహామహం' సందర్భంగా.. "అఖిల భారత సన్యాసి సంఘం" నిర్వహించిన 'మాసి మహాపెరువిల- 2025' కార్యక్రమానికి…
Maha Kumbh: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ‘‘మహా కుంభమేళా’’ ముగిసింది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ కుంభమేళాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, వేల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసింది. అందుకు తగ్గట్లుగా, దేశ విదేశాల నుంచి ‘త్రివేణి సంగమం’’కి భక్తులు పోటెత్తారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగిన ఈ హిందూ కార్యక్రమానికి ఏకంగా 66 కోట్ల మంది భక్తులు వచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ముగిసింది. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న అధికారికంగా కుంభమేళా ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా ఉత్సవం జరిగింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు.. దాదాపు 45 రోజులు నిర్వహించారు. దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రూ.3లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు కూడా నడిచాయి.
Mahakumbh 2025 : ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా ముగింపు దగ్గర పడింది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి నాడు జరిగే చివరి స్నానోత్సవమైన మహా కుంభమేళా సందర్భంగా జనసందోహాన్ని నిర్వహించడానికి, ఫిబ్రవరి 25 నుండి జాతర ప్రాంతం, నగరంలో వాహనాలు నిషేధిత జోన్ అమలు చేయబడుతుంది.
మహా కుంభమేళా మరో రికార్డ్ సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు ఊహించని రీతిలో భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దాదాపు అగ్ర రాజ్యం అమెరికా జనాభా కంటే రెండు రెట్లు అధికంగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కోట్లాది మంది భక్తుల పుణ్యస్నానాలతో ప్రశాంతంగా సాగిపోతుంది. ఇప్పటి దాకా 42 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు
PM Modi: మహాకుంభమేళాని ఎగతాళి చేసిన ప్రతిపక్ష నేతలపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ, సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని మోడీ ఆదివారం ఆరోపించారు. మధ్యప్రదేశ్ ఛత్తర్‌పూర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. విశ్వాసాలు, సాంస్కృతిక ఆచారాలను అపహాస్యం చేసే రాజకీయ నాయకులను, భారతదేశ మత వారసత్వాన్ని దెబ్బతీసే ‘‘ బానిస మనస్తత్వం’’ కలిగిన వ్యక్తులుగా మోడీ అభివర్ణిస్తూ విమర్శించారు.
భారత్ కు ఘనమైన సంస్కృతి, గర్వపడే ఆధ్యాత్మిక వారసత్వం ఉన్నాయని మహా కుంభమేళాతో మరోసారి రుజువైంది. మహా కుంభమేళాకు ఉత్సాహంగా పోటెత్తిన భక్తులు.. మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో మరోసారి విశ్వవ్యాప్తంగా భారత్ పేరు మార్మోగిపోయింది. అసలు ఆధ్యాత్మిక క్రతువు ఎలా జరగాలో మహాకుంభమేళా నిరూపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో ప్రతి ఘట్టం రికార్డులు సృష్టించి..
మహా కుంభమేళాలో ఏపీ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు.. ఈ సందర్భంగా తన భార్య, కుమారుడితో కలిసి దిగిన సెల్ఫీని మంత్రి లోకేష్ షేర్ చేయడంతో వైరల్‌గా మారిపోయింది..