భారతదేశం- న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ ఓడిపోయి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం వన్డే ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజా ర్యాంకింగ్స్‌లో ఒక్కొక్క స్థానం మెరుగుపరచుకున్నారు. కోహ్లీ మళ్ళీ టాప్-5లోకి చేరాడు. 743 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు.
టీ20ల్లో అదరగొడుతున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో అరంగేట్రం చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్‌కు అవకాశం దక్కింది. తన 10 ఓవర్ల స్పెల్‌లో 54 పరుగులు ఇచ్చి.. ఓ వికెట్ తీశాడు. టాప్ బ్యాటర్లను సైతం ఇబ్బందిపెడుతున్న వరుణ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ అవకాశం దక్కనుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు. ఎంతో అనుభవం కలిగిన…
Varun Chakravarthy: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. దీనితో ప్రస్తుతం 2-1తో టీమిండియా ఆధిక్యంలో నిలిపింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రికార్డ్స్ బద్దలు కొట్టాడు. గత రాత్రి జరిగిన మ్యాచులో 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా కోసం విలువైన వికెట్లు తీసి ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. భారత స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి…
హైబ్రిడ్ మోడల్‌లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. టీమ్ ఇండియా కెప్టెన్ పగ్గాలను రోహిత్ శర్మకే అప్పగిస్తూ.. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ముఖ్యమైన టోర్నమెంట్‌కు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. పవర్ ఫుల్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తిరిగి అరగేట్రం చేశాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న.. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…
IND Playing 11 vs BAN For 2nd Test: బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాను ఏకంగా 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అదే ఊపులో కాన్పూర్ వేదికగా శుక్రవారం ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ గెలిచి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన చూస్తోంది. అంతేకాదు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని లక్ష్యంతో రెడీ అవుతోంది.…
Kuldeep Yadav Eye on 300 Wickets: చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుండి భారత్, బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. స్పిన్‌కు స్వర్గధామమైన చెన్నై పిచ్‌పై స్పిన్నర్లు చెలరేగనున్నారు. ఈ క్రమంలో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన రికారుపై కన్నేశాడు. చెన్నై టెస్ట్‌లో కుల్దీప్ మరో ఆరు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఇప్పటివరకు 12 టెస్ట్‌ల్లో 53, 106 వన్డేల్లో 172, 40…
Kuldeep Yadav Rect on Marriage with Bollywood Actress: టీ20 ప్రపంచకప్ 2024 విజయోత్సవ సంబరాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబైలలో వేడుకల అనంతరం భారత జట్టు ఆటగాళ్లకు వారి వారి సొంత నగరాల్లో అభిమానులు ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. భారత్‌ను చాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు సొంతగడ్డ కాన్పూర్‌లో ఘనస్వాగతం లభించింది. అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి.. టపాసులు, డోలు చప్పుళ్ల మధ్య ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా…
India Beat Afghanistan in T20 World Cup 2024 Super-8: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో భారత్ శుభారంభం చేసింది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా గురువారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో గెలిచింది. 182 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 20 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా (3/7), అర్ష్‌దీప్ సింగ్ (3/36), కుల్దీప్ యాదవ్ (2/32) సత్తాచాటారు. అజ్మతుల్లా (26) టాప్ స్కోరర్. అంతకుముందు హాఫ్…
IND vs AFG Predicted Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో గ్రూప్ దశను విజయవంతంగా ముగించిన భారత్.. కీలకమైన సూపర్-8 సవాల్‌కు సిద్ధమైంది. వెస్టిండీస్‌లోని బార్బడోస్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగే పోరుకు రోహిత్ సేన అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అఫ్గాన్‌పై గెలిచి.. సూపర్-8లో శుభారంభం చేయాలని టీమిండియా చూస్తోంది. లీగ్ దశలో అంచనాలకు మించి రాణించిన అఫ్గాన్.. పటిష్టమైన బౌలింగ్‌తో రోహిత్ సేనకు షాకివ్వాలని భావిస్తోంది.…