బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాటను మరోసారి నిలబెట్టుకున్నారు. చిన్నారులు సోషల్ మీడియాలో పంపిన ఆహ్వానానికి ఫిదా అయిన కేటీఆర్.. ఆదివారం పాఠశాల వార్షికోత్సవానికి వెళ్లి వారిని ఆనందపరిచారు. తనకు వీడియో ద్వారా ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చిన్నారులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తనతో పాటు సోఫాలో కూర్చొబెట్టుకుని మరీ కాసేపు ముచట్లు చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకొని సంతోషం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్‌లోని హైదరాబాద్ మిలీనియం పాఠశాల మూడో వార్షికోత్సవం…
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఖరారు చేసే పనిలో పడ్డారు ఆయా పార్టీల అధిష్టానం పెద్దలు. నిన్న బీజేపీ అధిష్టానం 195 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. దీంతో పాటు.. తెలంగాణలోనూ పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేస్తూ పేర్లను ప్రకటించింది. అయితే.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో సీట్లు గెలిచేందుకు బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో…
పరకాలకు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కలిశారు. ఇటీవల పరకాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝాకు ఫోన్ చేసిన కేటీఆర్.. ఎస్ఐని సస్పెండ్ చేసి మిగతా అధికారులను కాపాడడం సరికాదన్నారు. పోలీసుల దాడిలో తీవ్ర గాయాలైన…
కేటీఆర్ మల్కాజిగిరి ఎంపీ పదవి పై నిన్న సవాల్ విసరడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నాం. నీకు నచ్చిన వ్యక్తి పేరు చెబితే రాజీనామా చేస్తారన్నారు. రాష్ట్రంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, భవిష్యత్తులో శిక్ష తప్పదని ఇక్కడి నుంచి తప్పించుకోవాలని కేటీఆర్ అలా మాట్లాడుతున్నట్లు ఉన్నారన్నారు. కేటీఆర్ నువ్వు ఎక్కడ ఉన్నా బేడీలు వేసి తీసుకు వస్తామని…
నేడు బీజేపీ తొలి జాబితా.. లిస్ట్‌లో మోడీ, అమిత్ షా! పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రచారాలు కూడా మొదలెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో త్వరలోనే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం సమావేశం అయింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము…
MLC Jeevan Reddy: కేటీఆర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చేపట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమంలో బస్సు ప్రమాదం సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలు వెళుతున్న బస్సు టైరు పగలడంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు.. పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు! ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేయడంతోనే పవన్ అధహ పాతాళానికి వెళ్ళిపోయాడన్నారు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్.. సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడుతాడా? అని మండిపడ్డారు. జనసేన పార్టీ నిర్మాణాన్ని…
మేము మేడిగడ్డ వెళ్తుంటే వాళ్ళు పాలమూరు పోతాము అంటున్నారని, సిల్లీ రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ రిపైర్లు చేయమంటే చేయట్లేదని, మార్చి 31 లోపు రిపేర్ చేసి నీళ్లు ఇవ్వకుంటే చాలా ఇబ్బందులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. మీరు చేయలేక పోతే మాకు ఇవ్వండి మేము చేసి చూపిస్తామని కేటీఆర్ అన్నారు. మీకు చేత…