MLA Rammohan Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, పార్టీ చిన్నాభిన్నమైన కూడా ఇంకా సిగ్గు రాట్లేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెల్లెలు కవిత జైలుకు పోయి, కేసులు చుట్టుముడుతుంటే కేటీఆర్ బుర్ర పని చేయడం లేదన్నారు. తీవ్ర నిరాశ నిస్పృహలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. ప్రజలు ఓడించి బుద్ధి చెప్పినా కేటీఆర్ లో బలుపు, అహంకారం తగ్గలేదని, నోటి దురుసు తగ్గించుకోకపోతే నాలుక చీరేస్తాం.. చీరి చింతకు కడతామన్నారు. ముఖ్యమంత్రి ని హౌలా అంటావా కేటీఆర్ ? నువ్వే పెద్ద హౌలా గాడివి. బట్టేబాజ్ గాడివి అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. నీ హౌలా పనులు అందరికి తెలుసు.. నీ బతుకే ఒక హౌలా బ్రతుకు… అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అన్ని పీకి నిన్ను ,నీ అయ్యను ఇంటికి పంపించారు అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’పార్లమెంటు ఎన్నికల్లో పీకడానికి కూడా ఏమీ లేదు నీ దగ్గర.. ఈ రాష్ట్రంలో ఎవరు జేబు దొంగనో అందరికి తెలుసు.. కల్వకుంట్ల కుటుంబం ప్రజల జేబులు కొట్టి దాచుకున్న వేల కోట్లు కక్కిస్తాం, దొంగలు కాబట్టే మీ చెల్లె తీహార్ జైల్లో ఉంది.. నువ్వు కూడా చంచల్ గూడ కుపోవడానికి సిద్ధంగా ఉండు.. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంటే నువ్వు, నీ కుటుంబం ఎందుకు వణుకుతుంది… ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేయించడానికి సిగ్గుందా నీకు.. మీ బతుకులు త్వరలో బయటపడతాయి…. ఎవరు వసూలు రాజా నో త్వరలోనే తెలుస్తుంది.. ఫోన్ ట్యాపింగ్ తో బెదిరించి మీరు చేయించిన వసూళ్ల జాబితా వస్తుంది.. సిద్ధంగా ఉండు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలను ఎవరు బెదిరించారో మీ ఎలక్షన్ బాండ్లు చూస్తే అందరికి అర్థమైపోతుంది.. బీజేపీలోకి వెళ్లాల్సిన కర్మ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేదు… పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ని బీజేపీలో విలీనం చేయడం ఖాయం.. ఇప్పటికే బీఆర్ఎస్ సగం ఖాళీ అయింది..
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ఎంపీ ఎన్నికల తర్వాత పూర్తిగా వాష్ అవుట్ అవుతుంది… ఎంపీ ఎన్నికల్లో బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న విషయం అందరికీ తెలుసు.. మీ పార్టీ ఎంపీ అభ్యర్థులను చూస్తేనే వ్యవహారం అర్థమౌతోంది.. సిగ్గు లేకుండా నువ్వు నీ బావ హరీష్ రావు అప్పట్లో మా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభ పెట్టి బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా..? దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరితే ఎగిరెగిరి పడుతున్నావు.. తలసాని ఏ పార్టీలో గెలిచి నీ అయ్య క్యాబినెట్ లో మంత్రి అయ్యాడో మరిచిపోయావా..? సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీ లో గెలిచి ఎక్కడ మంత్రిగా పనిచేశారో గుర్తు లేదా..? 10 యేళ్లలో 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యే లను చేర్చుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు..?’ అని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!