కేసీఆర్ ప్రభుత్వ కాలంలో 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మతం పేరుతో రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ముస్లిం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం రసూల్‌పురాలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డితో కలిసి స్థానికులతో మాట్లాడారు. ‘రసూల్‌పురా యువసేన’ అనే సంస్థ ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించింది. మైనారిటీ కమ్యూనిటీ యువత కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబసభ్యులు, యువకులు, పిల్లలతో సహా ప్రజలతో కేటీఆర్ సంభాషించారు, వారు ఉత్సాహంగా కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. ఇఫ్తార్‌లో పాల్గొన్న కేటీఆర్‌కు రసూల్‌పురా యువసేన సభ్యులు…
కవితను అరెస్టు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.. తెచ్చుకున్న తెలంగాణకు న్యాయం చేయకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడింది అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అందుకే వారి కుటుంబానికి తగిలే దెబ్బలు ప్రజలందరూ స్వీకరిస్తున్నారు. కవితను అరెస్టు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు అని తెలిపారు. అలాగే, కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం మాట్లాడకుండా ఉంది అంటే ఆరోజు మెగా వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తున్నారన్నారు. ఇక, వరంగల్ నగరంలో గతంలో…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల దాడికి దిగారు. ధైర్యంగా తన పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో తనపై పోటీ చేస్తానని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ, మల్కాజిగిరి నుండి పోటీ చేయాలనే సవాలుకు రేవంత్ రెడ్డి స్పందించలేదని,…
తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం పడిపోతుందని కలలో కూడా ఊహించలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం ఎట్లుంటదో జనాలకు అర్థం అయ్యింది.. ఈ ప్రభుత్వంపై గ్రామాల్లో మన్నువోసుడు, దుమ్మువోసుడే కనిపిస్తుంది. అయితే, మల్కాజ్ గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి ఒక్కడే లోకల్.. ఇద్దరు నాన్ లోకలే అని ఆయన చెప్పుకొచ్చారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపైన ఆయన ఘాటైన కామెంట్స్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, పార్టీ చిన్నాభిన్నమైన కూడా ఇంకా సిగ్గు రాట్లేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెల్లెలు కవిత జైలుకు పోయి, కేసులు చుట్టుముడుతుంటే కేటీఆర్ బుర్ర పని చేయడం లేదన్నారు. తీవ్ర నిరాశ నిస్పృహలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. ప్రజలు ఓడించి బుద్ధి చెప్పినా కేటీఆర్ లో బలుపు, అహంకారం తగ్గలేదని, నోటి దురుసు తగ్గించుకోకపోతే నాలుక చీరేస్తాం..…
BRS KTR: కుట్రపూరితంగా అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు పెడతామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
Manda Krishna Madiga: కడియం శ్రీహరి వల్లే..రాజయ్యను బీఆర్ఎస్ బర్తరఫ్ చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బిడ్డగా.. వరంగల్ జిల్లాకు చెందిన వాడిగా.. వరంగల్ రాజకీయాల గురించి మాట్లాడుతానని అన్నారు. కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగలను రాజకీయంగా ఎదుగుదకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. 40 ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి మాదిగ అని చెప్తూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారన్నారు. మాదిగ సామాజివర్గానికి చెందిన రాజకీయ నాయకులను…