రాష్ట్ర ప్రభుత్వం, కోటీశ్వరుల పిల్లలకు అందించిన నాణ్యమైన విద్యను పేద పిల్లలకు అందించాలనే లక్ష్యంతో యువ భారత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా గంధంవారి గూడెంలో రూ.300 కోట్లతో నిర్మించబోతున్న ఈ పాఠశాల ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైలాన్ ఆవిష్కరించి, భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇంగ్లీష్, తెలుగు…
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలో.. కేటీఆర్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతుంది. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టును కోరుతూ కేటీఆర్ పిటిషన్ వేశారు.
Madhu Sudhan Reddy: కేటీఆర్ మాటలు మూసి కంపు కంటే ఎక్కువ కంపు కొడుతున్నాయని.. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోతే సంబురాలు చేసుకుంటున్నాడని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. బీజేపీ గెలిచిందని సంకలు గుద్దుకుంటుండని., అక్కడ ఈవీఎంలు అవకతవకలు త్వరలో బయట పడతాయని., కాశ్మీర్ లో బీజేపీ ఓడిపోతే చప్పుడు చెయట్లేదని., రాహుల్ గాంధీ పై కేటీఆర్, హరీష్ రావులు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. మోరిగే కుక్క కరవదు. కేటీఆర్ మాటలు ఎవరు పట్టించుకోరని., కేటీఆర్…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్ తరఫున లాయర్ ఉమామహేశ్వర్ రావు ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టును కోరుతూ కేటీఆర్ పిటిషన్…
KTR: వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్నివంచనతో మళ్లీ సర్కారు ముంచిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులకు ఇచ్చింది పరిహారం కాదు…పరిహాసమన్నారు కేటీఆర్. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే.. వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయం అని., 4.15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు.. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదా..? పంట నష్టం అంచనాలను తల్లకిందులుగా ఎందుకు మార్చేసారు..? ఏకంగా…
కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు శాపనార్థాలు తప్పితే సూచనలు లేవని.. దసరా సందర్భంగా ప్రతిపక్షాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నామన్నారు.
తెలంగాణలో ప్రజా పాలనకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి నిత్యం అప్పులను ఎలా తీర్చాలి.. నిధులు ఎలా తెచ్చుకోవాలి అని సీఎం ప్రయత్నం చేస్తుంటే.. కేటీఆర్ ఇప్పటికి 20 సార్లు ఢిల్లీ వెళ్లిండు అని మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ సిగ్గు శరం ఉండే మాట్లాడుతున్నావా..? రాష్ట్రంకి కావాల్సిన అవసరాల కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంటే.. కేటీఆర్…
టీడీపీలో చేరుతాం.. క్లారిటీ ఇచ్చిన తీగల కృష్ణా రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రాబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డిలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేతలు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం…
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కంటే మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.1.5 లక్షల కోట్లతో మూసీ రివర్‌ఫ్రంట్ వంటి గొప్ప కార్యక్రమాలను ఏకకాలంలో నిర్వహిస్తూనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి అనడంపై ఆయన మండిపడ్డారు. “ప్రతిరోజూ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెరుగుతున్న అప్పుల గురించి ఏడుస్తూనే ఉంటాడు, కానీ చాలా మందికి అనవసరమైన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్…
రాష్ట్రంలో శనివారం జరిగిన ముగ్గురు అన్నదాతల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆదివారం అన్నారు. రైతు సంఘం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, భూమి ఉన్న రైతులు, కౌలు రైతులు ఆదరణ లేకపోవడంతో నష్టపోతున్నారని విమర్శించారు. సాగునీటి సంక్షోభంతో పాటు అసంపూర్తిగా ఉన్న పంట రుణమాఫీ, రైతు భరోసా పథకం లేకపోవడంతో వందలాది మంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, అనేక మంది తమ ప్రాణాలను బలిగొన్నారని రామారావు ఒక…