CM Vijay: సీఎం విజయ్ 52వ బర్త్‌డే.. మోడీ, రాహుల్‌గాంధీ, స్టాలిన్ విషెస్
- సీఎం విజయ్ 52వ బర్త్‌డే
- మోడీ, రాహుల్‌గాంధీ, స్టాలిన్ విషెస్
- తమ్ముడికి శుభాకాంక్షలు అంటూ కమల్‌హాసన్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ సోమవారం 52వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో విజయ్ పేరు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌గా మారింది.

Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
విజయ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘‘తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు. అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. “తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యం, విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. తమిళ ప్రజల హక్కులు, గౌరవం, ఆశయాల పరిరక్షణలో మీతో కలిసి నిలబడతాను. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం” అని సందేశం పంపారు.

ఇక తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కూడా విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘తమిళనాడు ముఖ్యమం జోసెఫ్ విజయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో కొనసాగేందుకు శారీరక, మానసిక ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను.’’ అని పేర్కొన్నారు. అలాగే సీనియర్ నటుడు కమల్ హాసన్ కూడా విజయ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “తమిళనాడు ముఖ్యమంత్రి, లక్షలాది మంది అభిమానుల ప్రేమను పొందిన నా తమ్ముడు విజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు” అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘జన నాయకగన్’ విడుదలపై ఎదురుచూపులు
విజయ్ జన్మదిన వేడుకల మధ్య ఆయన చివరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయకగన్’ విడుదలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. మొదట 2026 జనవరి 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తుది అనుమతి కోసం ఎదురుచూస్తోంది. కొన్ని సన్నివేశాలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని, అలాగే రాజకీయ పరమైన సూచనలు ఉన్నాయని సీబీఎఫ్సీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో సర్టిఫికేషన్ ప్రక్రియ ఆలస్యమైంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. విజయ్‌తో పాటు బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, నరైన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించారు. విజయ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత వస్తున్న ఈ చిత్రం కావడంతో అభిమానులు, రాజకీయ వర్గాల్లో కూడా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అందరి దృష్టి ‘జన నాయకగన్’కు తుది సర్టిఫికెట్ ఎప్పుడు వస్తుందన్న అంశంపైనే ఉంది.



Birthday greetings to the Chief Minister of Tamil Nadu, Thiru C. Joseph Vijay Ji. I pray for his long and healthy life.@TVKVijayHQ
— Narendra Modi (@narendramodi) June 22, 2026
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?