Vaibhav Sooryavanshi: ఆ బ్యాటింగ్ స్టైలే వైభవ్‌కు శాపమా..? ఊహించని ప్రమాదంలో సూర్యవంశీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన మెరుపు బ్యాటింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యువ ఆటగాడు, త్వరలోనే ఐర్లాండ్-ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే ట్రై-సిరీస్ ఫైనల్లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి, అందులో 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది లిస్ట్-ఎ క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు.
అయితే, సూర్యవంశీ సుదీర్ఘ కెరీర్ మరియు ఫిట్‌నెస్‌పై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ బ్యాటర్ డారిల్ కలినన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. సూర్యవంశీ ఆట శైలి పూర్తిగా పవర్ హిటింగ్‌తో కూడుకున్నదని, ప్రతి షాట్ కోసం అతను విపరీతమైన బ్యాట్ స్పీడ్‌పై ఆధారపడతాడని కలినన్ పేర్కొన్నాడు. ఈ వయసులో భారీ బ్యాట్‌తో అంత వేగంగా స్వింగ్ చేయడం వల్ల అతని మణికట్టు, మోచేతులు మరియు కీళ్లపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించాడు.
Also Read
- Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
- Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
- ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
- Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
గతంలో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా కెరీర్ ఆరంభంలో ఇలాగే దూకుడుగా ఆడాడని, అయితే 2004లో వచ్చిన ‘టెన్నిస్ ఎల్బో’ గాయం కారణంగా అతని కెరీర్ దాదాపు ముగిసిపోయే పరిస్థితి వచ్చిందని కలినన్ గుర్తుచేశాడు. సచిన్ అంతగా బ్యాట్ స్వింగ్ చేయకపోయినా గాయాల బారిన పడ్డాడని, మరి సూర్యవంశీ లాంటి హిట్టర్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు. ప్రస్తుతం క్రికెట్ షెడ్యూల్ చాలా బిజీగా ఉందని, నిరంతరాయంగా ఆడటం వల్ల 15 ఏళ్ల వయసులోనే ఎదుగుతున్న అతని కండరాలు, లిగమెంట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయని అన్నాడు.

తాము ఆడే రోజుల్లో తేలికపాటి బ్యాట్లు వాడేవాళ్లమని, తక్కువ క్రికెట్ ఆడేవాళ్లమని, అయినప్పటికీ కొందరికి మణికట్టు సమస్యలు వచ్చేవని కలినన్ తెలిపాడు. నేటి తరం ఆధునిక శిక్షణ, రికవరీ పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ యువ ఆటగాడి సుదీర్ఘ భవిష్యత్తు , ఆరోగ్యం పట్ల తనకు ఆందోళనగా ఉందని, వైద్య నిపుణుల సలహాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని అతను సోషల్ మీడియా వేదికగా సూచించాడు.
తాజావార్తలు
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!