కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు శాపనార్థాలు తప్పితే సూచనలు లేవని.. దసరా సందర్భంగా ప్రతిపక్షాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నామన్నారు.
తెలంగాణలో ప్రజా పాలనకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి నిత్యం అప్పులను ఎలా తీర్చాలి.. నిధులు ఎలా తెచ్చుకోవాలి అని సీఎం ప్రయత్నం చేస్తుంటే.. కేటీఆర్ ఇప్పటికి 20 సార్లు ఢిల్లీ వెళ్లిండు అని మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ సిగ్గు శరం ఉండే మాట్లాడుతున్నావా..? రాష్ట్రంకి కావాల్సిన అవసరాల కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంటే.. కేటీఆర్…
టీడీపీలో చేరుతాం.. క్లారిటీ ఇచ్చిన తీగల కృష్ణా రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రాబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డిలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేతలు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం…
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కంటే మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.1.5 లక్షల కోట్లతో మూసీ రివర్‌ఫ్రంట్ వంటి గొప్ప కార్యక్రమాలను ఏకకాలంలో నిర్వహిస్తూనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి అనడంపై ఆయన మండిపడ్డారు. “ప్రతిరోజూ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెరుగుతున్న అప్పుల గురించి ఏడుస్తూనే ఉంటాడు, కానీ చాలా మందికి అనవసరమైన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్…
రాష్ట్రంలో శనివారం జరిగిన ముగ్గురు అన్నదాతల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆదివారం అన్నారు. రైతు సంఘం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, భూమి ఉన్న రైతులు, కౌలు రైతులు ఆదరణ లేకపోవడంతో నష్టపోతున్నారని విమర్శించారు. సాగునీటి సంక్షోభంతో పాటు అసంపూర్తిగా ఉన్న పంట రుణమాఫీ, రైతు భరోసా పథకం లేకపోవడంతో వందలాది మంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, అనేక మంది తమ ప్రాణాలను బలిగొన్నారని రామారావు ఒక…
BRS Dharna: అర్హులైన రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కందుకూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నారు.
KTR: రైతులు పండించిన దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ అని ప్రకటించడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR Tweet: 20 లక్షల మందికి రుణమాఫీ అందలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడంతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Patnam Mahender Reddy: సబితా ఇంద్రారెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇద్దరికి నా ఫామ్ హౌజ్ పక్కనే ఫామ్ హౌజ్ లు ఉన్నాయని తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం.. ఈ నవరాత్రులలో ప్రత్యేకం.. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి.. కనకదుర్గమ్మ భక్తులకు బాలాత్రిపురసుందరిగా దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో వస్తున్నారు.. తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు.. ఈసారి ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేసిందంటున్నారు భక్తులు.. మరోవైపు..ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం అందజేశారు ముంబైకి చెందిన సౌరభ్..…