నుడా చైర్మన్ అభినందన సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయం సువర్ణ మయం కాబోతుందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఇంట్లో నియామకాలు చేసుకున్నారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులకు ఏం చేశారని కేంద్ర మంత్రులు రోడ్లు ఎక్కి ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరగనివ్వమని, ఉనికి కోసం బి.అర్.ఎస్. గ్రూప్ _1 అభ్యర్థులను రెచ్చగొట్టిందన్నారు…
రికార్డు ధరకు రాజా సాబ్ ఆడియో రైట్స్.. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ ఉండేలా ప్లానింగ్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. వాటిలో ఒకటి మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ లో హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రం రానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్న…
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ద్వారా 18,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. వివిధ మార్గాల్లో ప్రజలపై విద్యుత్ భారం మోపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గృహ అవసరాలకు నెలకు 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జ్ ఐదు రెట్లు పెంచాలని భావిస్తోందని, పది రూపాయలు ఉన్న ఛార్జీని 50 రూపాయలు చేయాలని భావిస్తోందన్నారు. ఇళ్ళల్లో…
ఫార్మా కంపెనీ కడితే కట్టు… లేకపోతే కాంగ్రెస్ పార్టీ రైతులకు తిరిగి భూములను ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరు ప్రమిద కన్వెన్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దసరా సమ్మేళనం కార్యక్రమంలో కేటీఆర్, జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,ఎమ్మెల్యే సబితా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రవేశ పెట్టిన రిజర్వేషన్లు అమలు చేయండని అన్నారు. కార్యకర్తలను…
ఏఐ సాంకేతికతతో 60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన లోకో పైలట్.. వీడియో వైరల్ అస్సాంలో ఓ లోకో పైలట్ తన తెలివి తేటలతో పెను ప్రమాదాన్ని కాపాడారు. వాస్తవానికి.. రైలు నంబర్ 15959 కమ్రూప్ ఎక్స్ప్రెస్ గౌహతి నుంచి లుమ్డింగ్కు వెళ్తోంది. రాత్రి 8:30 గంటల సమయంలో.. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ అకస్మాత్తుగా 60 కంటే ఎక్కువ ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ గుండా వెళుతున్నట్లు చూశారు. ఏనుగుల గుంపును చూసిన లోకో పైలట్…
ఇబ్రహీంపట్నoలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో నిర్వహించిన దసరా సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాళ్ల పాలనలో ఈ సారి దసరా దసరా లెక్క లేదు, బతుకమ్మ, వినాయక చవితి పండుగలు గతంలో మాదిరిగా జరగలేదన్నారు. రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గతంలో అన్నాడని, కేసీఆర్ ముష్టి రూ. 10 వేలు…
వానాకాలం రైతు భరోసా ను ఎగగొట్టడం రాష్ట్ర రైతంగాన్ని మోసం చేయడమే అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా పోయినట్లే అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇచ్చిన ప్రకటన కు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు.…
KTR: రైతు భరోసా పై బీఆర్ఎస్ నేడు నిరసనకు పిలుపు నిచ్చింది. మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు.
అందుకే నల్ల షర్టు వేసుకున్నా.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు హరీష్ రావు, కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరూ కలిసి మా జిల్లాకు నష్టం చేకూరే పనులు చేస్తున్నారు.. అందుకే నల్ల షర్టు వేసుకున్నానని మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరైడ్ కు శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బీసీ అన్నారు. ఎస్ఎల్బీసీ, మూసీ శుద్దికరణ విషయంలో ముఖ్యమంత్రిని అభినందుస్తున్నా అన్నారు. ఒక వైపు ఫ్లోరైడ్, మరోవైపు కోటిన్నర…
వానాకాలం రైతు భరోసా ను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమే అని బీఆర్ఎస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందన్నారు. వానాకాలం పంట సీజన్ కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసిందని, లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు కేటీఆర్. రేపు,…