120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ai+ Nova 2 Neo 5G and Nova 2 Pro 5G Launched: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Ai+ భారత్‌లో తన నోవా (Nova) సిరీస్ లో భాగంగా 2 కొత్త 5జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. Ai+ Nova 2 Neo 5G, Ai+ Nova 2 Pro 5G పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. సరసమైన ధరల్లో మెరుగైన పనితీరు అందించడమే లక్ష్యంగా ఈ మొబైల్స్ ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత NxtQuantum OS పై పనిచేస్తాయి. NxtPrivacy Dashboard, AI Key వంటి ప్రత్యేక ఫీచర్లను కూడా కలిగి ఉన్నాయి. Nova 2 Neo 5G ప్రధానంగా మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులు, బడ్జెట్ ఫోన్ కోరుకునే వారికి అనువుగా రూపొందించబడింది.
Also Read
- Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
Nova 2 Neo 5G ఫీచర్లు:
Nova 2 Neo 5Gలో 6.74 అంగుళాల HD+ 120Hz డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 48MP సోనీ IMX582 ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే IP65 రేటింగ్, సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Nova 2 Pro 5Gలో ఫీచర్లు:
మరోవైపు Nova 2 Pro 5Gలో 6.9 అంగుళాల FHD+ 144Hz డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, 48MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 13MP ఫ్రంట్ కెమెరా, స్టీరియో స్పీకర్లు, 6000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్లో ప్రత్యేకంగా కస్టమైజ్ చేయగలిగే రియర్ నోటిఫికేషన్ లైట్స్ కూడా ఉన్నాయి.
ధర:
ధరల విషయానికి వస్తే.. Nova 2 Neo 5G 4GB+128GB వేరియంట్ రూ.12,999కు, 6GB+128GB వేరియంట్ రూ.13,999కు అందుబాటులో ఉంటుంది. Nova 2 Pro 5G 6GB+128GB వేరియంట్ ధర రూ.15,999 కాగా, 8GB+128GB వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించారు. అన్ని ప్రధాన క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1,000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభించనుంది. జూన్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!