సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాను స్పూర్తిగా తీసుకొని సుభాష్‌రెడ్డి అనే వ్యక్తి కామారెడ్డి జిల్లాలోని బీబీపేటలో పాఠశాలను 8 కోట్లతో అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసిన ఈ పాఠశాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతేకాకుండా ఈ పాఠశాలకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న మహేశ్‌బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. త్వరలోనే శ్రీమంతుడు బృందంతో ఈ స్కూలును సందర్శిస్తానని.. అంతేకాకుండా తన సినిమా స్పూర్తితో ఈ పాఠశాల అభివృద్ధికి పాటుపడిన సుభాష్‌రెడ్డిని అభినందించారు.