Indian Racing League: ఇండియా మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ హిస్టరీలో సరికొత్త అధ్యాయానికి హైదరాబాద్ వేదిక అయింది. నిన్న మెరుపు వేగంలో దూసుకెళ్తున్న కార్లు.. సరికొత్త సందడితో రేసింగ్ పోటీలు హైదరాబాద్ వాసుల్ని ఉర్రూతలూగించాయి. ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. లీగ్ తొలి రోజు క్వాలిఫయర్ నిర్వహించాల్సి ఉండగా.. ట్రాక్‌పై అవగాహన కోసం డ్రైవర్లు రోజంతా సాధన చేశారు. అయితే నిన్న లీగ్ తొలిరోజు ఇండియన్ రేసింగ్ సాధన చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. రయ్ రయ్ మంటూ కార్లు దూసుకుపోతున్నాయి. ఒక్కసారిగా అక్కడున్న చెట్టుకొమ్మ కారు నెంబర్ 9 పై విరిగి పడింది దాంతో ఆ కారులు ప్రమాదానికి గురైంది. కొమ్మ పడుతూనే కారు నెంబర్ 9 నడుపుతున్న రేసర్ ఒక్కసారిగా అక్కడున్న గోడకున్న ముందు భాగం తాకుతూ కార్లు ఒక్కసారిగా క్రాస్ అయ్యింది.
Read also: Bajrang Dal: శ్రద్ధావాకర్ హత్య “లవ్ జీహాద్”కు ఉదాహరణ.. అఫ్తాబ్ దిష్టిబొమ్మ దహనం
కారు పట్టు తప్పడంతో స్పీడ్ గా ముందుకు వెల్లి ఎదురుగా కాస్ పై ఆగింది. ముందు వెళుతున్న కారు నెంబర్ 10కి ప్రమాదం జరగలేదు. వెనుక నుంచి వచ్చిన రేసింగ్ కారులకు కూడా ప్రమాదం ఏమీ కాలేదు. కారుడ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేయడంతో కారు నడుపుతున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఆ రేసింగ్ చూడటానికి వచ్చిన వారికి ఒక్కసారిగా గుండె ఆగింది. ఆహ్లాదంగా చూస్తున్న సమయంలో ఇలా ప్రమాదం జరగడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే అంతా బాగుజరుగుతున్న సమయంలో చెట్టు కొమ్మ పడటం ఏంటని మండిపడుతున్నారు. అంతా క్లీన్ చేసిన దానికోసమే ప్రత్యేకంగా రోడ్డులను అక్కడున్న ప్రాంతాన్ని రేసింగ్ సిద్దం చేసినప్పుడు చెట్ల కొమ్మలను ఎందుకు అడ్డుగా పెట్టారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
Read also: Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీగా పడిన ధర
అయితే.. ఈ రేసింగ్ కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షు కూడా విచ్చేశారు. వారు ఎంతో ఆసక్తిగా రేసును తిలకిస్తున్న సమయంలో ఐమ్యాక్స్ పక్కన ఏర్పాటు చేసిన గ్యాలరీ కుంగిపోయింది. ఆ సమయంలో కేటీఆర్, హిమాన్షు అక్కడే ఉన్నారు. ఇక, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే..ఈ ఇండియన్ కార్ రేసింగ్ పై గత కొన్నిరోజులుగా ప్రచారం చేస్తుండడంతో నేడు భారీగా జనాలు తరలివచ్చారు. ఇవాళ ప్రధాన పోటీలు జరగనున్నాయి. అసలు సిసలైన పోటీలు జరగనున్నాయి. అయితే ఈ పోటీలను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలిరానున్నారు.
Hyderabad 🔥 pic.twitter.com/qA7KCvF60c
— KTR News (@KTR_News) November 19, 2022