తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. బీఈడీ మరియు డీఈడీ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ను నిర్వహించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. చివరిసారిగా గత సంవత్సరం జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించిన సంఘం తెలిసిందే.ఈ మేరకు మంత్రి వర్గ ఉప సంఘం పలు కీలక నిర్ణయం తీసుకుంది.బీఈడీ, డీఈడీ కోర్సులు…
రాష్ట్రంలో పనీ చేస్తున్న 27 వేల మంది ఆశలకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఈనెల నుంచి ఆశాలకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ముందుగా జిల్లా తంగళ్లపల్లి మండలం వ్యవసాయ కళాశాలలో ఉదయం 11 గంటలకు బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
Minister KTR Says Metro Rail for Hyderabad Airport: హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి వచ్చింది. శనివారం ఉదయం నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గ్రేటర్ చుట్టూ 158 కిమీ మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ఇప్పటివరకు 19 ఇంటర్ చేంజ్‌లు ఉండగా.. కొత్తగా మరో మూడింటిని ప్లాన్ చేశారు. నార్సింగి, కోకాపేట నియో పొలీస్, మల్లంపేట ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ముందుగా నార్సింగి ఓఆర్ఆర్…
మహబూబాబాద్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కేటీఆర్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. మానుకోటలో రూ.50 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అసహనానికి గురయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రారంభించేందుకు వెళ్తున్న కేటీఆర్ తో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా మంత్రి కేటీఆర్ సీరియస్ గా ఎమ్మెల్యే చేయిని తీసి పడేశారు.
వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించారు. మ్యాన్‌హోల్స్, నాలాలు, వరదనీటి కాలువల వల్ల గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి కోసం కేటీఆర్ ఢిల్లీ వెళ్లలేదని విమర్శించారు. ఐటీ దాడుల నుంచి బయటపడేందుకు మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఆరోపించారు.
కేంద్ర మంత్రి అమిత్‌తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ కాలేదు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నా అమిత్ షా బిజీగా ఉండడంతో సమావేశం రద్దయింది. అమిత్ షా ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని, కలవడం కుదరదని కేంద్ర హోంశాఖ అధికారులు కేటీఆర్ కు సమాచారం అందించారు.
KTR Delhi Tour: మంత్రి కేటీఆర్ రెండు రోజు ఢిల్లీ పర్యటన కొనసాగతుంది. ఇవాళ మధ్యాహ్నం కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరితో కేటీఆర్ సమావేశం కానున్నారు. మెట్రో రెండో దశ పనులకు కేంద్ర సాయం కొరనున్నారు. ఇక అమిత్ షా అపాయింట్మంట్ కోసం కేటీఆర్ వేచివున్నారు.