Komatireddy Venkat Reddy: నల్గొండలో మరొక్కసారి అవకాశం ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలను కోరారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో.. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్,కౌన్సిలర్లు భేటీ అయ్యారు. కోమటి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాకప్పుకున్నారు. అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ఇండ్లు లేవు.. ఉద్యోగాలు ఇవ్వలేదు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. నల్గొండలో మరొక్కసారి అవకాశం ఇవ్వండి అని కోరారు. కేసీఆర్.. సిరిసిల్ల.. సిద్దిపేట..గజ్వెల్ కె సీఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ దత్తత తీసుకున్న కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టారా..? అని ప్రశ్నించారు. రోడ్డు ఒక్కటి వేసి.. అభివృద్ధి అంటున్నాడు అంటూ వ్యంగాస్త్రం వేశారు. 10 నెలల్లో సెక్రటేరియట్ ఎలా కట్టావు? అంటూ ప్రశ్నించారు. పేదల ఇండ్లు కట్టాలంటే కంట్రాక్టర్ రాలేదు అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి సెక్రటేరియట్ ఎలా పూర్తి అయ్యింది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
నల్గొండ గౌరవం దక్కేలా పని చేస్తా అని అన్నారు. కేసీఆర్ సిలిండర్ 400 కె ఇస్తా అన్నారని గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు ఇవ్వలేదు? అంటూ ప్రశ్నించారు. పదేళ్ల క్రితం నీకు ఎందుకు ఆలోచన రాలేదు? అని కోమటి రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పథకాలు కాపీ కొట్టాడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హామీలు అమలు చేస్తామని తెలిపారు. హరీష్..కేటీఆర్ తప్పా..మంత్రులు అంతా ఇంటికే పరిమితం అయ్యారు అన్నారు. వరంగల్ డాక్టర్ ప్రీతి ఆత్మహత్య మరిచిపోక ముందే..ప్రవల్లిక ఆత్మహత్య బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్.. పరీక్ష రాయలేదు అంటున్నాడు? లవ్ ఎఫైర్ అని డీసీపీ అంటారు? దీనిపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన అమ్మాయి పై ఆబండాలు వేయడం సరికాదని మండిపడ్డారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపనీకి ఇంటర్ ఫలితాలు ఇచ్చే బాధ్యత ఇచ్చి విద్యార్థులతో చెలగాటం ఆడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tammineni Sitaram: పవన్ కల్యాణ్‌కి అoత పవనం లేదు.. టీడీపీ పని క్లోజ్..!