KTR: ఐటీ, ఉద్యోగ కల్పనలో తెలంగాణే నెంబర్ వన్ అని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. బెంగుళూర్ ని వెనక్కి నెట్టి ఐటీలో ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జైపూర్ ట్రైన్ కాల్పుల ఘటనలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్ కు ట్విటర్ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. జైపూర్-ముంబై ట్రైన్ కాల్పుల్లో హైదరాబాద్ నాంపల్లి బజార్ఘాట్ కు చెందిన సయ్యద్ సయూద్దీన్ మృతి చెందాడు
Kishan Reddy: మహబూబ్ నగర్ లో జరిగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ర్యాలీ లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బయలుదేరారు. ర్యాలీ అనంతరం అక్కడ జరిగే సభలో పాల్గొననున్నారు.
Revanth Reddy open letter to Minister KTR: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.
ఈరోజుల్లో టెక్నాలజీ పరుగులు పెడుతుంది.. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ ట్రెండ్ నడుస్తుంది.. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తుంది..ఎంత అంటే.. ఏకంగా ఆర్టిఫిషియల్ యాంకర్లను పెట్టి న్యూస్ చదివించేంత. అయితే.. ఇప్పుడు ఏఐ గురించి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటారా.. అక్కడికే వస్తున్నా. రేపు తెలంగాణ యంగ్ డైనమిక్ మినిస్టర్.. కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. ఆయన అభిమానులు బర్త్ డే శుభాకాంక్షలతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. అద్దిరిపోయే సీడీపీలు, ఉర్రూతలూగించే పాటలతో…
టీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ సెక్టార్ లో పురోగతితో యువత ఆలోచన ధోరణిలో మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. ఐటీ ఉద్యోగులు 30 ఏళ్లలోపే ఇళ్లను కొనేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు 2.41 లక్షల కోట్లకు చేరాయని మంత్రి తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకుని అరెస్ట్ చేయడం దుర్మార్గమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. వచ్చే సెప్టెంబర్ 14న జర్మనీలోని బెర్లిన్ నగరంలో నిర్వహించే గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అలయెన్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని ఆయనను కోరారు.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా ఉచిత విద్యుత్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
KTR Tweet: రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తే 24 గంటల ఉచిత కరెంటు అవసరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నోటి వెంట కాపులకు రెండో ప్రమాద హెచ్చరిక వెలువడిందని అంటున్నారు.