KTR Delhi Tour: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు.
KTR Tweet: దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతామని మాటిస్తున్నమంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాధన ఉద్యమం అత్యున్నతమైనదని, ప్రజాస్వామిక పోరాటాల నాయకుడని మంత్రి కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
Minister KTR: కరీంనగర్ జిల్లాలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. అందులో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపన చేసారాయన. జిల్లా గ్రంథాలయ భవనంలో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంఖుస్థాపన చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, కార్పోరేషన్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ ను మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ప్రారంభించారు. Read Also: Yash 19: గీతూ మోహన్ దాస్ తో యష్ 19..…
KTR: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు గంభీరావుపేట మండలం గోరంత్యాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించి, 11 గంటలకు ‘మన ఊరు.. మన బడి’లో నిర్మించిన ఎల్లారెడ్డిపేట పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు.
KTR-Harish Rao: నేడు సిద్దిపేట పట్టణంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పర్యటించనున్నారు. ముందుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కొద్దిసేపు విశ్రాంతి అనంతరం 10.30 గంటలకు పట్టణ శివారులోని ఇర్కోడు గ్రామంలో ఆధునిక కబేళాను ప్రారంభిస్తారు.
Harish Rao: కేసీఆర్ నంబర్ వన్ కబట్టే.. తెలంగాణ నంబర్ వన్ అయ్యిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. నిమ్స్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించదగ రోజని వ్యాఖ్యానించారు.
గద్దర్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారు అనే చర్చ పార్టీలో జరగలేదని.. ఏదైనా అధిష్ఠానమే ఫైనల్ చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
పాలంపేటలో ఉండే యూనేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని కేటీఆర్ సందర్శించారు. అనంతరం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన.. ఆలయ విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాకుండా అక్కడి నుంచి రామప్ప చెరువుకు వెళ్లి బోటింగ్ చేశారు. అనంతరం చెరువులోకి వచ్చే గోదావరి జలాలకు మంత్రి కేటీఆర్ పూజలు చేశారు. అంతేకాకుండా స్థానిక మత్స్యకారులతో కాసేపు ముచ్చటించారు.
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత సీఎం ఎవరన్నదానిపై ప్రచారం సాగుతుంది. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. అటు నేతలతో పాటు ఇటు ప్రజల్లో కూడా ఓ ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. తన మనసులోని మాటను వెల్లగక్కారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని తెలిపారు.
Irrigation Day: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు మొదలయ్యాయి. రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు నీటిపారుదల దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.