Balasani Laxminarayana: బీసీ లకు జరిగిన అవమానం కోసం రాజీనామా చేశానని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. నా ఆత్మభిమానం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సార్లు అవమానించారని అన్నారు. అధిష్టానంకు చెప్పుకుంటే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలు భరించానని అన్నారు. అధికార మదంతో BRS నాయకులు ప్రవర్తించారని అన్నారు. మావోయిస్టు ప్రాంతంలో కష్టపడి పనిచేశానని అన్నారు. తాతా మధు పెద్ద పుడింగా అంటూ మండిపడ్డారు. పార్టీ కోసం పనిచేసిన నన్ను పక్కన పెట్టి పుడింగికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కటేమిటి చాలా అవమానాలు జరిగాయన్నారు. భద్రాచలం ఇంచార్జి నుంచి తొలగించడానికి కారణం చెప్పలేదు కాబట్టే రాజీనామా చేస్తున్నానని అన్నారు. పుడింగి సంగతేంటో రాబోయే ఎన్నికల్లో అక్కడే చూస్తానని అన్నారు. బీసీ లకు జరిగిన అవమానం కోసం రాజీనామా చేశానని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఎంతమంది బీసీ లకు పదవులిచ్చారో చెప్పాలి? అని ప్రశ్నించారు. పొన్నాల లక్ష్మయ్యను ఆహ్వానిస్తావ్…..మమ్మల్ని అవమణిస్తావా కేటీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పంపారు. బాలసాని లక్ష్మీనారాయణ 1987లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరపున రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా భద్రాచలం బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించడంతో బాలసాని లక్ష్మీనారాయణ బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 2009లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2015లో ఖమ్మం స్థానిక సంస్థ నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వర్‌రావుపై 31 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్న ఆయన.. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరనున్న సంగతి తెలిసిందే.