Minister KTR: మంత్రి కేటీఆర్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాలను స్వయంగా కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లనున్నారు. దీంతో ఈ విషయం చర్చకు దారితీస్తోంది. నిన్న పొన్నాల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పొన్నాల రాజీనామా చేస్తున్నట్లు ఖర్గేకి లేఖ రాశారు. టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు పార్టీ అన్యాయం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జనగామ టిక్కెట్టు ఇస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ అసహనంతో పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
అయితే పొన్నాల కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ లో చేరుతారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నాలపై ఫైర్ అవుతున్నారు. 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు వీడటం ఏంటని పొన్నాల పై మండిపడుతున్నారు. అయితే ఇటు కాంగ్రెస్, అటు పొన్నాల విమర్శనస్రతాలు చోటుచేసుకుంటున్నా పరిణామంలో మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లడం చర్చకు దారితీస్తోంది. భేటి అనంతరం పొన్నాల బీఆర్ఎస్ లో చేరుతారా? ఒక వేళ చేరితో ఏ నియోజక వర్గానికి ఆయన కేటాయిస్తారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
బాధతో పార్టీ కి రాజీనామా చేస్తున్నానని అంటూ ఖర్గేకు లేఖలో తెలిపిన విషయం తెలిసిందే.. 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పార్టీ ఓడిపోయిందని అన్నారు. కానీ నన్ను రాజీనామా చేయించి బలి పశువుని చేసింది పార్టీ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2018 లో కూడా పార్టీ ఒడిపోయిందని, కానీ అప్పటి నాయకులను మాత్రం రాజీనామా చేయాలని అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీలో మేము పరాయి వాళ్ళము అయ్యామని అన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపించినా నమస్తే పెడితే కూడా స్పందించడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతం సామాజిక న్యాయంకి పాతర పడిందని అన్నారు. బీసీ నాయకుల టికెట్లు ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని అన్నారు. సర్వేల పేరుతో.. సీట్లు ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hrithik Roshan: మెట్రోలో ప్రయాణించిన హృతిక్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్..