బీజేపీ రాష్ట్రాలపై కక్ష సాధింపు కోసమే గవర్నర్లను వాడుకుంటున్నారని ఐటీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అత్యున్నత రాజకీయ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కిషన్ రెడ్డి ట్వీట్ చేయగా.. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై మంత్రి కేటీఆర్ అదే విధంగా కౌంటర్ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను బట్టబయలు చేయడంలో ఎప్పుడూ ముందుండే కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. అదానీ కోసం బయ్యారం బలి అయ్యారని ట్వీట్ చేశారు. ఈ అంశంపై వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను జత చేశారు.
ఢిల్లీలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మొదటి నుంచి బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ కౌంటర్ రిమార్క్స్ తో దూసుకుపోతున్న కేటీఆర్ ఇటీవల ఉమ్మడి జిల్లా పర్యటనలో ప్రధానంగా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ప్రసంగాలు కొనసాగించారు.
సామాజిక మాధ్యమాల్లో, ట్విటర్ లో మంత్రి కేటీఆర్ నిత్యం చురుకుగా ఉంటారు. అది అందరికి తెలిసిన విషయమే.. ప్రతి అంశాలపై స్పందిస్తూ కేంద్రంతో పాటు విపక్షాలపై తనదైన శైలిలో వ్యంగాస్ర్తాలు వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు అవకాశం ఇస్తే, త్వరలో ఆర్బీఐ ముద్రించే నోట్లపై నరేంద్ర మోడీ బొమ్మను వేసే అవకాశాలు ఉన్నాయని.. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మ బదులుగా నరేంద్ర మోడీ బొమ్మను ముద్రించినా ఆశ్చర్యం లేదని మండిపడ్డారు మంత్రి కేటీఆర్
బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్నారు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో మహిళా క్రికెటర్, మాజీ కెప్టెన్ మిథాల్‌రాజ్‌తో పాటు.. సినీ హీరో నితిన్‌తో భేటీకానున్నారు.. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర ముగింసభలో ఆయన పాల్గొననున్నారు.. అయితే, విపక్షాలపై, ముఖ్యంగా బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో ముందుండే తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇప్పుడు నడ్డా పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన సెటైరికల్…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. గాయం అయ్యింది.. రెస్ట్‌లో ఉన్నాను అంటూ కేటీర్ ఓటీటీలో సినిమాల కోసం సలహా అడిగితే మేం వెటకారంగా ట్వీట్ చేశాం అన్నారు.. దానికి చిన్న దొర గారికి కోపం వచ్చిందని.. మాపై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారని మండిపడ్డారు.. దమ్ముంటే సబ్జెక్టు మాట్లాడండి.. అధికారం చేతుల్లో ఉంది, పాలన చేతుల్లో ఉంది, ఇంట్లో కూర్చుని…
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను వరుసగా ఎండగడుతూ వస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.. తాను ఈ మధ్య ఏ సభలో పాల్గొన్న కేంద్రం విధానాలను తప్పుబడుతున్నారు.. ఇక, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆయన.. ట్విట్టర్ వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.. వరుస ట్వీట్లతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. 30 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం అనే ఓ జాతీయ మీడియా కథనాన్ని షేర్ చేసిన మంత్రి కేటీఆర్.. అందులో…