KTR Tweet: గవర్నర్ తీరుపై కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: బీజేపీ రాష్ట్రాలపై కక్ష సాధింపు కోసమే గవర్నర్లను వాడుకుంటున్నారని ఐటీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం వైఖరిని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొంతం దిలీప్ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు కేటీఆర్ తన వ్యాఖ్యను జోడించారు. తమ అధికారాలను నిర్దాక్షిణ్యంగా దుర్వినియోగం చేస్తున్న దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాల్లోని గవర్నర్లపై తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న తీర్మానానికి మద్దతుగా కొంతం దిలీప్ ట్వీట్ చేశారు.
బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ గవర్నర్ కూడా కొన్ని బిల్లులను పెండింగ్‌లో ఉంచారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో స్పందించారు. రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు కేంద్ర ప్రభుత్వ అధీనంలో రాజకీయ పావులుగా మారారని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదని, ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. సహకార సమాఖ్య పాలనకు ఇది ఒక నమూనా కాదా అని ఆయన అడిగారు. టీమ్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర వైఖరి ఉందని, ఇది దేశ ప్రగతికి, సామరస్యానికి ఎలా దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో ప్రశ్నించారు.
Also Read
- Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్‌తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..
- Bhatti Vikramarka: పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ.. క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.!
- KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
- Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
Sad state of affairs where top constitutional posts have become political tools in the hands of Union Govt
Have a look at all Non-BJP Governed states; you will see a similar clear pattern of Non-Cooperation & vengefulness
Is this the Cooperative Federalism model and Team India… https://t.co/kHtvnCjGKm
— KTR (@KTRBRS) April 11, 2023
తాజావార్తలు
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
The Revolutionaries OTT: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నలుగురు వీరులు.. ఓటీటీలోకి హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ సిరీస్
-
Irumudi Censor : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే?
-
Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్‌తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..
-
Bhatti Vikramarka: పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ.. క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.!
ట్రెండింగ్
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!