KTR satirical Tweet: బీజేపీ చీఫ్ టూర్‌పై కేటీఆర్ సెటైర్ .. ఈ రోజు ఏ గులాం నడ్డా చప్పల్ మోస్తారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్నారు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో మహిళా క్రికెటర్, మాజీ కెప్టెన్ మిథాల్‌రాజ్‌తో పాటు.. సినీ హీరో నితిన్‌తో భేటీకానున్నారు.. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర ముగింసభలో ఆయన పాల్గొననున్నారు.. అయితే, విపక్షాలపై, ముఖ్యంగా బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో ముందుండే తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇప్పుడు నడ్డా పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన సెటైరికల్ ట్వీట్ వైరల్‌గా మారిపోయింది.. తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ కార్టూన్‌ను షేర్ చేసిన ఆయన.. పాప్ క్విజ్ అంటూ.. ఈరోజు జేపీ నడ్డా చప్పల్‌ను ఏ గులాం మోస్తారు..? అంటూ ప్రశ్నించారు.. అంతే కాదు.. తీవ్రమైన పోటీ ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను… ! అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Ghanta Chakrapani: ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాలొచ్చాయి..
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
కాగా, మునుగోడు బహిరంగ సభ కోసం తెలంగాణ వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. హైదరాబాద్‌లో మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.. అయితే, అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. పరుగు పరుగు వెళ్లి.. అమిత్ షాకు చెప్పులు అందించారు.. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిపోయింది.. బండి సంజయ్‌కు కొందరు మద్దతుగా నిలిస్తే.. మరికొందరు మండిపడుతూ ట్వీట్లు చేశారు.. టీఆర్‌ఎస్‌తో పాటు, కాంగ్రెస్ నేతలు కూడా బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు.. ఇప్పుడు బీజేపీ జాతీయ చీప్ జేపీ నడ్డా పర్యటన సమయంలో.. టైమింగ్ చూసి.. “పాప్ క్విజ్.. ఈరోజు జేపీ నడ్డా చెప్పులు మోసే గులాం ఎవరు..? దీనికి తీవ్రమైన పోటీ ఉంటుందని కచ్చితంగా అనుకుంటున్నాను” అంటూ ఒక నవ్వు సింబల్‌తో చేసిన సెటైరికల్ ట్వీట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అయితే, కేటీఆర్ ట్వీట్‌కు స్పందిస్తున్న నెటిజ్లు ఇంకా ఎవరు? బండి సంజయేనని కొందరు..! ధర్మపురి అరవింద్ అని మరికొందరు..! సెటైర్లు కాదు.. సమస్యల సంగతి ఏంటని ఇంకా కొందరు రిప్లై ఇస్తున్నారు.
KTR Latest Tweet
Pop quiz:
Which Ghulam will carry the Chappal of JP Nadda today?
Am sure there is intense competition 😁 pic.twitter.com/Tz8YiCYIiS
— KTR (@KTRBRS) August 27, 2022
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!