KTR: నేడు 71వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న కేసీఆర్ కు పెద్దెతున్న శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. తన తండ్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తన అనుభూతులను వ్యక్తం చేశారు. “మా నాన్న నాకు ఒక్కడికే హీరో కాదు, తెలంగాణలో అందరికీ హీరోనే” అంటూ ఆయన పేర్కొన్నారు. తాను కేసీఆర్ కుమారుడిగా జన్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అన్నారు.
Read Also: Amardeep Kumar: రూ.1700 కోట్లతో దుబాయ్కి పారిపోయిన ఫాల్కన్ చైర్మన్
తెలంగాణ రాష్ట్ర సాధనలో డబ్బు బలం లేకుండా, కండ బలం లేకుండా, కానీ గుండె బలం మీదే పోరాడి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన ఆయన చావు నోట్లో తల పెట్టి తెలంగాణ కోసం పోరాడారని కొనియాడారు. ఇక కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు సభ్యులు మహేష్ రెడ్డి రూ. 3 లక్షల చెక్ అందజేశారని, ఈ మొత్తాన్ని క్యాన్సర్ రోగుల సహాయార్థం వినియోగించాలని కోరారు. మహేష్ రెడ్డికి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Gold Price: మరోమారు దూకుడు చూపిస్తున్న బంగారం ధరలు..
ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ.. గత 14 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. గ్రామాలకు, పట్టణాలకు వెళ్లిన ప్రతిసారీ ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. “మన లక్ష్యం ఒక్కటేనని.. మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడం. రాబోయే మూడేళ్లు అందరూ కలిసి పని చేసి తెలంగాణను బలంగా నిలబెట్టాలని కోరారు. కేసీఆర్ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఆయనను మళ్లీ గెలిపించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.