BRSV Student Meet: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు దిశానిర్దేశం చేయడానికి బీఆర్ఎస్వి (BRSV), తెలంగాణ జాగృతి సంస్థలు ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రెండు సంస్థలూ విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వడమే లక్ష్యంగా సెషన్లను ప్లాన్ చేశాయి. హైదరాబాద్ ఉప్పల్ లోని మల్లాపూర్ VNR గార్డెన్స్ లో ఈ రోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి “తెలంగాణ విద్యార్థి సదస్సు” జరగనుంది. ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
Hyderabad: అక్రమ సంబంధం అనుమానం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య..!
ఆపై మధ్యాహ్న భోజన అనంతరం ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ విద్యాశాఖ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్వి విద్యార్థులకు దిశానిర్దేశం చేయడానికి కేటీఆర్ ప్రత్యేకంగా హాజరవుతున్నారు. ఈ సదస్సు విద్యార్థులలో సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన పెంపొందించేందుకు ఏర్పాటు చేశారు.
Fake Certificates: నకిలీ సర్టిఫికెట్స్ ముఠాను అరెస్ట్ చేసిన SOT బృందం..!
ఇంకొవైపు, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో “లీడర్” అనే శిక్షణ తరగతులు ఈరోజే కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ లో జరుగుతున్నాయి. జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో యువత, విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక బాధ్యతలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ శిబిరంలో రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులు, యువత హాజరుకానున్నారు.