ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఈ రోజు జరుగనున్న మ్యాచ్ లో పాండ్యా బ్రదర్స్ తలపడనున్నారు. అహ్మదాబాద్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే ఈ మ్యా్చ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా తండ్రి అయ్యాడు. అతని భార్య పంఖూరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు తన ట్విటర్‌లో ఈ ఆనందాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. ఇక తమ కొడుకు పేరును కవిర్ కృనాల్ పాండ్యా' అని పెట్టినట్లు తెలిపాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అనూహ్య విజయాలతో లక్నో దూసుకువెళుతోంది. లీగ్ లోకి పసికూనగా ప్రారంభించిన లక్నో ప్రస్థానం అప్రమతిహతంగా సాగుతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్ సూపర్ కింగ్స్ మరోసారి అపజయం మూటగట్టుకుంది. బలమైన బ్యాటింగ్ లైన్ కలిగి ఉన్న పంజాబ్ 154 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పోయింది. దీంతో 113 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత పంజాబ్ బౌలర్లు రాణించి 153 పరుగులకే లక్నోను కట్టడిచేశారు. అయితే,…
ఆదివారం రాత్రి లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. అసలు ఏం జరిగిందంటే.. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ వేగంగా ఆడలేకపోయాడు. 20 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. చివరి ఓవర్‌లో ముంబై గెలవాలంటే 38 పరుగులు చేయాలి. ఈ దశలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి…