India Predicted Squad for Asia Cup 2025: యూఏఈలో సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం ఈనెల 19 లేదా 20న అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒకటి, రెండు స్థానాలకు మినహా జట్టుపై బీసీసీఐ సెలెక్టర్లు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. పనిభార నిర్వహణలో…
Asia Cup 2025 India Squad Update: 2025 ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమై.. 28తో ముగుస్తుంది. ఆతిథ్య హక్కులు భారత్ దగ్గరే ఉన్నా.. గతంలో పాకిస్తాన్‌తో ఒప్పందంలో భాగంగా తటస్థ వేదిక యూఏఈలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగనుండగా.. అబుదాబి, దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. టోర్నీకి ఇంకా…
నేడు బెంగళూరు, ఆర్సీబీ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ ఈసారి తన సొంతమైదానం ముల్లాన్‌పుర్‌లో ఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. పరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బెంగళూరు లక్ష్యం 158 పరుగులు.
సోమవారం ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 222 పరుగుల భారీ ఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసి ఓడింది. తిలక్ వర్మ (56; 29 బంతుల్లో 4×4, 4×6), హార్దిక్ పాండ్యా (42; 15 బంతుల్లో 3×4, 4×6) ముంబైని గెలిపించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా (4/45), జోష్ హేజిల్‌వుడ్ (2/37),…
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్, ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా దేశంలోని ప్రతి మూల నుంచి యువ ప్రతిభను గుర్తిస్తూ తన మార్క్ ను చాటుకుంది. ముంబై ఇండియన్స్ (MI) స్కౌటింగ్ జట్టు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది టాలెంట్ ప్లేయర్స్ ను గుర్తించి అవకాశం ఇచ్చింది. ఈ ఆటగాళ్ళు ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడానికి సహాయపడటమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా తమదైన ముద్ర వేశారు. ఐపీఎల్ 18వ సీజన్‌లో కూడా…
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ ఓ మోస్తరుగా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే అన్ని జట్లు ‘ప్లే ఆఫ్’ బెర్త్ కోసం తెగ పోరాడుతున్నాయి. ఇకపోతే తాజాగా ప్రస్తుతం టీమిండియాలో ఉన్న క్రికెట్ సోదరులు పాండే ఫ్యామిలీ నుండి శుభవార్త వచ్చింది. పాండ్య కుటుంబంలోకి ఓ బుడ్డోడు కొత్తగా చేరాడు. ప్రస్తుత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య సోదరుడు, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడైన కృనాల్ పాండ్య మరోసారి తండ్రి అయ్యాడు. Also Read: Jasprit…
Hardik Pandya stepbrother Vaibhav Pandya arrested: టీమిండియా క్రికెటర్స్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు కోట్ల రూపాయలు మోసపోయారు. పాండ్యా సోదరుల కజిన్ (వరుసకు సోదరుడు) అయిన వైభవ్ పాండ్యా.. పార్ట్‌నర్‌షిప్ బిజినెస్‌లో వీరికి దాదాపు రూ.4.3 కోట్లు కుచ్చుటోపీ పెట్టాడు. ఈ ఘటనపై హార్దిక్, కృనాల్ ఫిర్యాదు చేయడంతో.. ముంబై పోలీసులు వైభవ్ పాండ్యాను అరెస్ట్ చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషయంలోకి వెళితే… 2021లో హార్దిక్ పాండ్యా, కృనాల్…
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనింగ్ జోడీ క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయింది. ఓపెనర్ దీపక్ హూడా ( 5 ) మూడో ఓవర్ లోని తొలి బంతికి ఔట్ అయ్యాడు. ఆ వెంటనే మూడో ఓవర్ లోని సెకండ్ బాల్ కి ప్రేరక్ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ జాసన్ బెహ్రెండోర్ఫ్ మూడో ఓవర్ వేసి కీలకమైన రెండు వికెట్లు తీసుకున్నాడు.