IPL 2022: మైదానంలో కృనాల్ పాండ్యా ఓవరాక్షన్.. మాజీల మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం రాత్రి లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. అసలు ఏం జరిగిందంటే.. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ వేగంగా ఆడలేకపోయాడు. 20 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. చివరి ఓవర్లో ముంబై గెలవాలంటే 38 పరుగులు చేయాలి. ఈ దశలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి ఓవర్లో బంతిని కృనాల్ పాండ్యాకు అందించాడు. దీంతో కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో పొలార్డ్ భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.
ఈ క్రమంలో తీవ్ర నిరాశతో క్రీజును వీడుతున్న పొలార్డ్ భుజం ఎక్కి కృనాల్ పాండ్యా అతడి తలను ముద్దు పెట్టుకున్నాడు. కానీ పొలార్డ్ ఎలాంటి స్పందనా లేకుండా భారంగా పెవిలియన్ చేరాడు. ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నప్పుడు పొలార్డ్, కృనాల్ పాండ్యా మంచి స్నేహితులు. కానీ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థుల్లా తలపడ్డారు. తొలుత లక్నో బ్యాటింగ్ సమయంలో కృనాల్ వికెట్‌ను పొలార్డ్ తీశాడు. అనంతరం అతడి వికెట్ కృనాల్ తీయడంతో ఆనందానికి హద్దు లేకపోవచ్చు. కానీ పొలార్డ్‌ను ముద్దు పెట్టుకుని అతడిని కవ్వించేలా చేయడాన్నే అందరూ తప్పుపడుతున్నారు.
Also Read
- Hardik Pandya: ముంబై డిమాండ్లకు అంగీకరించని రాజస్థాన్.. హార్దిక్ విషయంలో అసలు ఏం జరిగిందంటే?
- India Playing 11: కొత్త ఆటగాడికి ఛాన్స్?.. న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
- Tom Latham: ఆమ్మో జస్ప్రీత్ బుమ్రా.. రెండు సార్లు డకౌట్.. రెండో టెస్టుకు మాస్టర్ ప్లాన్ వేశా!
అవుటైన పొలార్డ్ మానసిక స్థితిని అర్థం చేసుకోకుండా కృనాల్ పాండ్యా వ్యవహరించిన తీరుపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్ధివ్ పటేల్ ఘాటుగా స్పందించాడు. ‘కృనాల్, పొలార్డ్ మంచి స్నేహితులు. కానీ ప్రత్యర్థులుగా మైదానంలో దిగినపుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. పొలార్డ్ పరుగులు చేయలేకపోవడంతో నిరాశలో ఉన్నాడు. ముంబై మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉంది. అలాంటపుడు ఎవరి మానాన వారిని వదిలేయాలి. అంతగా చనువు ఉంటే.. డ్రెస్సింగ్‌రూంలో ఏడాదంతా ఎంత సరదాగా ఉన్నా పర్లేదు కానీ మైదానంలో ఇలా చేయకూడదు. ఈ రియాక్షన్ నాకైతే మరీ ఓవర్‌గా అనిపిస్తోంది’ అంటూ కృనాల్ తీరును తప్పుబట్టాడు.
మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ కూడా ఈ అంశంపై మాట్లాడాడు. ఒక ఆటగాడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న స్థితిలో ఇలాంటివి చేయకపోవడం మంచిదని.. ఆ సమయంలో అతడి భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేమని.. ఒకవేళ పొలార్డ్ వెనక్కి తిరిగి సమాధానం ఇచ్చి ఉంటే ఏమయ్యేది అంటూ కృనాల్‌ను ప్రశ్నించాడు. తను జట్టును గెలపించలేకపోతున్నాననే నిరాశతో వెనుదిరిగినపుడు కృనాల్ ఇలా చేయడం నిజంగా టూ మచ్ అని ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు.
https://www.youtube.com/watch?v=QcwN-dIyNXo
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
JC Prabhakar Reddy: నాకు రాజకీయ ప్రతిష్ఠ ముఖ్యం కాదు.. పల్లెల్లో మార్పే నా లక్ష్యం..
-
Post Office MIS Scheme: ఒక్కసారి రూ.5 డిపాజిట్ చేస్తే.. నెలానెలా జీతం లాంటి ఆదాయం!
-
Wheat Flour Soup Recipe: చలికాలానికి బెస్ట్ డిన్నర్.. రొట్టెలకు బదులుగా హెల్తీ ఫుడ్.. 10 నిమిషాల్లో రెడీ!
-
Kenishaa : జయం రవి వివాదంలో బిగ్ ట్విస్ట్.. ఆ రోజు కోర్టుకు రాకపోతే అంతే!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!