Lucknow Super Giants Scored 47 In First 10 Overs: లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు.. చెన్నై బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పుకూలుతోంది. తొలి పది ఓవర్లలో ఏకంగా 5 వికెట్లు కోల్పోయి, కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది. ఇది బౌలింగ్ పిచ్ కావడం, ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించడంతో.. ధోనీ తన తెలివిని ఉపయోగించి స్పిన్నర్లతోనే బౌలింగ్ వేయిస్తున్నాడు. దీంతో.. వాళ్లు చెలరేగిపోతున్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ, లక్నో బ్యాటర్లను ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పరుగులు కొట్టే అవకాశమే ఇవ్వకుండా, ముప్పుతిప్పలు పెడుతూ, వికెట్లు తీస్తున్నారు.
KL Rahul: లక్నో జట్టుకి బిగ్ షాక్.. మొత్తానికే కేఎల్ రాహుల్ దూరం!
ప్రారంభం నుంచి లక్నో జట్టు తడబడుతూ వస్తోంది. బంతి స్వింగ్ అవుతుండటంతో.. ఎలా ఆడాలో లక్నో బ్యాటర్లకు అంతుచిక్కలేదు. విధ్వంసకర ఆటగాడు కైల్ మేయర్స్ కూడా గందరగోళానికి గురై.. క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ వెంటనే మనన్ వోహ్రా వెనుకవైపు షాట్ కొడదామని వికెట్లు వీడి షాట్ కొట్టబోగా.. అది మిస్సై నేరుగా వికెట్ల వైపుకు దూసుకెళ్లింది. తద్వారా అతడు బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే కృనాల్ పాండ్యా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం వచ్చిన మార్కస్ స్టోయినిస్, తొలి బంతికే ఫోర్ కొట్టి జోష్ నింపాడు. కానీ.. జడేజా చేతికి అడ్డంగా చిక్కాడు. అతడు వేసిన లెగ్ స్పిన్ బంతిని పసిగట్టలేక.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కరణ్ శర్మ కూడా క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇలా వికెట్లు పడుతుండటంతో.. లక్నో స్కోరు నత్తనడకన ముందుకు సాగుతోంది. ప్రస్తుతం క్రీజులో పూరన్, బదోని ఉన్నారు. మరి.. వీళ్లిద్దరు ఎక్కడిదాకా లాక్కొస్తారో చూడాలి.
The Kerala Story: ఎట్టకేలకు సాధించారు.. కేరళ స్టోరీ బ్యాన్..?