SRH vs LSG: సన్‌రైజర్స్‌పై లక్నో విజయం.. 16 ఓవర్లలోనే సమాప్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow Super Giants Won By 5 Wickets Against Sunrisers Hyderabad: శుక్రవారం ఏకన స్పోర్ట్స్ సిటీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో 16 ఓవర్లలోనే లక్నో ఛేధించింది. లక్ష్యం చిన్నదే కావడంతో.. లక్నో ఆటగాళ్లు సునాయాసంగా మ్యాచ్‌ని ముగించేశారు. హడావుడి చేయకుండా.. ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేధించి గెలుపొందారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా సన్‌రైజర్స్ బౌలర్లు కీలకమైన వికెట్లు తీయగలిగారు కానీ, లక్ష్యం మరీ చిన్నది కావడంతో డిఫెండ్ చేయడం కష్టమైపోయింది. అటు.. లక్నో బ్యాటర్లు తమవంతు కృషి అందించి, టార్గెట్‌ని అలవోకగా ఛేధించడంలో కీలక పాత్ర పోషించారు.

Also Read
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
- IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
- Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులే చేసింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఖరీదైన ఆటగాళ్లందరూ (మయాంక్ అగర్వాల్, కెప్టెన్ ఎయిడెన్ మర్ర్కమ్, హ్యారీ బ్రూక్) చెత్త ప్రతిభతో తీవ్ర నిరాశపరిచారు. మర్ర్కమ్ అయితే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ (26 బంతుల్లో 31) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. మధ్యలో రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ నిదానంగా ఇన్నింగ్స్ కొనసాగించారు. మరో వికెట్ పడకుండా ఉండేలా.. జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో బంతులు ఎక్కువగా అయిపోయాయే తప్ప.. స్కోరు బోర్డు మాత్రం నత్తనడకన సాగింది. చివర్లో వచ్చిన అబ్దుల్ సమద్ రెండు సిక్సులు, ఒక ఫోర్‌తో చెలరేగడంతో.. సన్‌రైజర్స్ స్కోరు 121కి చేరింది. ఒకవేళ అబ్దుల్ లేకపోయి ఉంటే.. సన్‌రైజర్స్ 100 పరుగుల మైలురాయిని అందుకోవడం కూడా గగనంలా కనిపించింది.
Shraddha Das: స్విమ్ సూట్ లో చిన్నది సెగలు రేపుతోంది
ఇక 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు.. 16 ఓవర్లలోనే 126 పరుగులు చేసి, లక్ష్యాన్ని ఛేధించింది. స్వల్ప లక్ష్యమే కావడంతో.. లక్నో ఆటగాళ్లు పెద్దగా కష్టపకుండా, సరదాగా ఆడుతూ పాడుతూ అలవోకగా లక్ష్యాన్ని ఛేధించి గెలుపొందారు. ఈ మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా హైలైట్ అయ్యాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన అతగాడు.. తన బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించాడు. 34 వ్యక్తిగత పరుగులు చేశాడు. అయితే.. ఒక షాట్ కొట్టబోయి అన్మోల్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ విజయంతో లక్నో రన్‌రేట్ అమాంతం పెరగడంతో.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.
తాజావార్తలు
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!