కృష్ణానది యాజమాన్య బోర్డు కమిటీ.. రేపటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పరిశీలన వాయిదా పడింది… నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు బుధవారం రోజు కేఆర్ఎంబీ కమిటీ రాయలసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించాల్సి ఉంది.. అయితే, మంగళవారం సాయంత్రం వరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో… పరిశీలన వాయిదా వేశారు.. ఇక, జూలై 3వ తేదీన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్తామని కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం ఇచ్చింది…