Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఉన్న కేసుకు తోడు తాజాగా మరో కేసు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకు చేరింది. తాజాగా, సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్‌ను అక్రమంగా తరలించారనే ఆరోపణలపై కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఇద్దరిపై కేసు నమోదైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. Read Also: Water Storage at…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. వచ్చేనెల 6వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తమ్మిన పట్నం గ్రామానికి రానున్నారు.. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ.
కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను పూర్తిగా మూసివేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. కాకినాడ, విశాఖపట్నం, మూలపేట, ఎన్నోర్ పోర్టులకు సంబంధించి ఎన్ని వెజల్స్ వస్తున్నాయనే విషయంపై షెడ్యూల్ వచ్చిందని తెలిపారు. కృష్ణపట్నంకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక్కడకు కంటైనర్లు వచ్చే అవకాశం లేదు.. కాబట్టి షెడ్యూల్ రాలేదని ఆరోపించారు. మంత్రి కాకాణి ఈ విషయంలో మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టులో జరిగిన ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం అదానీ కృష్ణపట్నం పోర్టుకు ఇండోనేషియా నుంచి ఓ నౌక బొగ్గు లోడ్‌తో వచ్చింది. నౌకలోని ట్యాంకర్‌ను క్యాజువల్ ఉద్యోగులు క్లీన్ చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఆనందయ్య మందును ఆన్‌లైన్‌లో పంపిణీ చేస్తున్నారని, ఆన్‌లైన్‌లో పంపిణీ పేరుతో కాకానీ కోట్లు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలను శ్రేశిత టెక్నాలజీ ఎం.డీ నర్మద కుమార్ ఖండించారు. నర్మద కుమార్ ఫిర్యాదుతో సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం, ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రేపటి నుంచి ఆనందయ్య…