Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఉన్న కేసుకు తోడు తాజాగా మరో కేసు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకు చేరింది. తాజాగా, సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్‌ను అక్రమంగా తరలించారనే ఆరోపణలపై కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఇద్దరిపై కేసు నమోదైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Water Storage at Dams: వరద ప్రవాహం.. నీటితో కళకళాడుతున్న శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు..!
ఇక ఈ కేసు ఉండగానే.. మరోవైపు కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్‌ను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు వసూలు చేశారంటూ మరో కేసును ముత్తుకూరు పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులోనూ కాకానితో పాటు మరికొందరు వ్యక్తులపై ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. తొలుత అక్రమ గ్రావెల్ తరలింపు, ఆ తర్వాత టోల్ వసూళ్ల దుర్వినియోగంపై నమోదైన ఈ కేసులతో మాజీ మంత్రి కాకానిపై వివాదాలు మళ్లీ చర్చనీయాంశమవుతున్నాయి. చూడాలి మరి ఈ కేసులపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో.
Read Also: Marriage Scam: భర్త, పిల్లలు ఉన్న సరే.. మరో యువకుడిని పెళ్లాడిన మాయలేడీ.. చివరకి..?