తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఆనందయ్య మందును ఆన్‌లైన్‌లో పంపిణీ చేస్తున్నారని, ఆన్‌లైన్‌లో పంపిణీ పేరుతో కాకానీ కోట్లు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలను శ్రేశిత టెక్నాలజీ ఎం.డీ నర్మద కుమార్ ఖండించారు. నర్మద కుమార్ ఫిర్యాదుతో సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం, ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రేపటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణపట్నం ఎవరూ రావొద్దని, అందరికీ మందు అందేలా చేస్తామని అధికారులు చెబుతున్నారు.