బీఆర్ఎస్ నాయకత్వంపై , గత ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే, ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినప్పటికీ, ప్రతి రూపాయిని పొదుపు చేస్తూ పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. “గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితమైంది తప్ప,…
హైదరాబాద్ నగరం నేడు ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతోందంటే అది గత మూడు దశాబ్దాల (1995-2025) నిరంతర శ్రమ ఫలితమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. జర్మన్ టెక్నాలజీతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసిన సుజెన్ మెడికేర్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా ఇటువంటి తయారీ యూనిట్లు రావడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం క్యూర్ (Cure),…
కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు మాజీ సీఎం కేసీఆర్‌కు లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దృష్టి మళ్లించడానికి కృష్ణా జలాల అంశం కేసీఆర్ లేవనెత్తుతున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా తానే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టించా అని చెప్పారు. ఇక కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. కేసీఆర్‌పై సీఎం రేవంత్ మాట్లాడిని భాష సరికాదన్నారు. ఈరోజు మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్…
తెలంగాణ ఉద్యమంలో సర్వం ఒడ్డి కొట్లాడిన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారని.. పార్టీల కంటే ప్రజల అవసరాలు ముఖ్యం అని చెప్పే వాళ్లే ఇక్కడ ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్‌లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అజెండా ఎలా ఉంది.. రాజకీయ ఆర్థిక ప్రయోజనం ఏం పొందారు అనేది చర్చనీయాంశం కాదని.. ఇక్కడ తొమ్మిదిన్నరేళ్ళు.. కేసీఆర్…