Andhra Pradesh Casino: గెట్ టుగెదర్ పేరుతో అనుమతులు.. క్యాసినో నిర్వహణకు ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మరోసారి క్యాసినో పాలిటిక్స్ బహిర్గతం అయ్యాయి. గతంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తాజాగా కృష్ణా జిల్లాలో మరోసారి క్యాసినో కలకలం రేగింది. ఓ గోవా కంపెనీ గెట్ టుగెదర్ పేరుతో పార్టీ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. కాక్‌టైల్ డిన్నర్, సినీ హీరోయిన్‌ల స్టెప్పులు, సింగర్ల పాటలు, మధురమైన అనుభూతి ఉంటుందని నిర్వాహకులు ప్రచారం చేశారు. దీని కోసం ఆకర్షణీయమైన ఆహ్వాన పత్రాలను పంపారు. భారీ ఏర్పాట్లతో హోరెత్తించారు. కానీ కథ మొత్తం అడ్డం తిరిగింది.
పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు వేదికగా ఆయానా కన్వెన్షన్ సెంటర్‌లో గోవా మెజిస్టిక్ సంస్థ క్యాసినో ఆడించేందుకు సర్వం సిద్ధం చేసింది. మంగళవారం రాత్రి క్యాసినో నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. సంపన్నులు, ప్రముఖులు, కొందరు నేతలకు ఈ ఈవెంట్‌కు సంబంధించి ఆహ్వాన పత్రికలు అందాయి. ఓ ఈవెంట్ పేరుతో గోవా నుంచి అమ్మాయిలు, సినిమా హీరోయిన్‌లు, సింగర్లు వస్తున్నారని నిర్వాహకులు ఊదరగొట్టారు. సినీ తారలకు భారీగానే అడ్వాన్సులు చెల్లించారు. కన్వెన్షన్ సెంటర్‌కు క్యాసినో పేరుతో అడ్వాన్సులు చెల్లించారు. ఎంట్రీ ఫీజు రూ.20వేలు వరకు పెట్టినట్లు తెలుస్తోంది. హైటెక్ పార్టీ పేరుతో రెండు రోజుల పాటు ఏర్పాట్లు చేస్తూ యూత్‌లో జోష్ పెంచారు. గెట్ టుగెదర్ పార్టీ తరహాలో ఈవెంట్ ఉంటుందని కంకిపాడు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మద్యం సరఫరాకు అనుమతి ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు. దీంతో గెట్ టుగెదర్ పార్టీనే కదా అని పోలీసులు కూడా అనుమతి ఇచ్చేశారు.
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
అయితే గోవా కంపెనీ ముద్రించిన ఆహ్వాన పత్రాలు బయటకు రావడంతో ఇది క్యాసినో పార్టీ అని తేలిపోయింది. మీడియాలో వరుస కథనాలు రావడంతో క్యాసినో నిర్వాహకుల దూకుడుకు బ్రేక్ పడింది. అయితే అధికారులు ఎవరికి వారు తాము ఈ పార్టీకి అనుమతులు ఇవ్వలేదని చేతులెత్తేశారు. కరోనా కారణంగా గోవాలో క్యాసినో నిర్వహణకు బ్రేక్ పడిందని మెజిస్టిక్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం రెగ్యులర్ కస్టమర్లకు గెట్ టుగెదర్ తరహాలో పార్టీ ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. ఏప్రిల్ 13న హైదరాబాద్‌లో ఈవెంట్ ఏర్పాటు చేశామని.. ఏపీ కోసం కంకిపాడులో పార్టీ పెట్టగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రద్దు చేశామని తెలిపారు. అయితే ఈ క్యాసినో పార్టీ నిర్వహణలో పలువురు రాజకీయ నేతలు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు