Education Minister: కోచింగ్ సెంటర్లకు కేరాఫ్‌గా ఉన్న రాజస్థాన్ కోటా పట్టణంలో గత కొన్నేళ్లుగా విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఆత్మహత్యలపై రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఈ ఆత్మహత్యలకు విద్యాపరమైన ఒత్తిడి, కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలు కూడా కారణమవుతున్నాయని అన్నారు.