ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అణ్వాయుధ క్షిపణుల ప్రయోగాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇటీవలే హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఉత్తర కొరియా తాజాగా మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. మంగళవారం ఉదయం ఉత్తర కొరియా తూర్పుతీరంలో ఈ క్షిపణిని ప్రయోగించింది జపాన్‌కు షాక్ ఇచ్చింది. జపాన్ లక్ష్యంగా చేసుకొని ఈ క్షిపణిని ప్రయోగించినట్టు సమాచారం. అంతర్జాతీయ ఆంక్షలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా కిమ్ అణ్వస్త్ర ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు. దక్షిణ కొరియా రాజధాని…
అందరిదీ ఒకదారైతే, ఉత్తర కొరియా దేశానిది మరోక దారి. తమను విమర్శించిన వారికి వార్నింగ్‌లు ఇవ్వడం అన్నది వారికి కామన్. దక్షిణ కొరియా, అమెరికాపై ఒంటికాలిపై విరుచుకుపడే ఉత్తర కొరియా ఇప్పుడు ఏకంగా ఐరాసాను టార్గెట్ చేసింది. ఐరాసాపై విరుచుకుపడింది. ఇటీవలే నార్త్ కొరియా దేశం ఓ క్షిపణిని ప్రయోగించింది. సూపర్ సోనిక్ క్షిపణీ వ్యవస్థను సొంతం చేసుకోవడంతో వివిధ దేశాలు ఆందోళన చేస్తున్నాయి. నార్త్ కొరియాతో ఎప్పటికైనా డేంజర్ అని, వీలైనంత వరకు ఆ…
ఉత్తర కొరియా గురించిన ఎలాంటి చిన్న వార్త బయటకు వచ్చినా అది వెంటనే వైరల్ గా మారటం సహజమే. ఆ దేశంలో జరిగే విషయాలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటాయి. గత కొంతకాలంగా కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని వార్తలు అధికంగా వచ్చే సమయంలో ఆయనకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రచురిస్తుంటుంది. అయితే, ఆయన ఆకారంలో వచ్చిన మార్పులను బట్టి కొన్ని రకాల ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నారన్నది మాత్రం వాస్తవం. ఇక ఇదిలా…
ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారం ఇంకా ముగియకముందే ఇప్పుడు అమెరికాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఉత్తర కొరియా ఇప్పుడు మళ్లీ అణు సమస్యలు తెచ్చిపెట్టేందుకు సిద్ధం అయింది. అణు రియాక్టర్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చినట్టు ఐక్యరాజ్యసమితి అటామిక్ ఏజెన్సీ పేర్కొన్నది. ఇది అంతర్జాతీయ అణుచట్టాలకు విరుద్ధమని ఐరాస పేర్కొన్నది. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తో సమావేశానికి ముందు యాంగ్‌బ్యోన్‌లోని అణు రియాక్టర్‌ను…
తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పి ఓ వ్యక్తి సెకండ్ హ్యాండ్‌లో ప్రిడ్జ్‌ను కోనుగోలు చేశాడు. ఇంటికి తెచ్చుకున్నాక ఆ ప్రిడ్డ్ ను శుభ్రం చేసే సమయంలో కింద స్టిక్కర్ కనిపించింది. ఆ స్టిక్కర్‌ను ఓపెన్ చేయగా లోపలి నుంచి నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు… 1.30 లక్షల డాలర్లు. మన కరెన్సీలో సుమారుగా రూ.96 లక్షలు అని చెప్పొచ్చు. అంత పెద్ద మొత్తంలో డబ్బును చూసి మొదట కోనుగోలు దారుడు…
ఉత్తర కొరియాలో నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించకుంటే శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. అయితే గత కొంతకాలంగా దక్షిణ కొరియా కల్చర్‌ను ఉత్తర కొరియా యువత ఫాలో అవుతున్నది. దక్షిణ కొరియా స్టైల్‌ను, ఫ్యాషన్‌ను, వారు మాట్లాడే విధంగా మాట, యాసలు అలవరుచుకుంటున్నారు. ఇలా చేయడం వలన ఉత్తర కొరియా సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతింటాయని, యువత పక్కదోవ పడుతున్నారని భావించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ…
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం తప్పితే చర్చలు లేవని చెప్పే కిమ్ నోటివెంట చర్చలమాట వచ్చింది. చర్చలకైనా, యుద్ధానికైనా సిద్దంగా ఉండాలని కిమ్ తన సేనలతో చెప్పినట్టు కొరియా అధికారిక మీడియా ప్రకటించింది. దీనిపై అమెరికా సానుకూలంగా స్పందించింది. కమ్ వ్యాఖ్యలు ఆసక్తికరమైన సంకేతంగా భావిస్తున్నామని, అయితే, అణ్వాయుధాలను త్యజించే అంశాలపై కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి నేరుగా సంకేతాలు వచ్చేవరకు ఎదురు చూస్తామని అమెరికా పేర్కొన్నది. Read: హరి హర వీరమల్లు:…