కొరియన్ మోడల్ చోయ్ సూన్-హ్వా కలలను నెరవేర్చుకునేందుకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించారు. 80 ఏళ్ల వయస్సులో ఈ బ్యూటీ మిస్ యూనివర్స్ కొరియా పోటీలో పాల్గొని చరిత్ర సృష్టించారు.
కొరియాలోని డేగులో జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ ఛాంపియన్‌షిప్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లలో భారత్ మరో నాలుగు స్వర్ణ పతకాలను గెలుచుకుంది.
ప్రపంచంలోని అందరిదీ ఒక దారైతే, ఉత్తర కొరియాది మరోదారి. ఆదాయం కోసం ఆ దేశం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ప్రపంచమంతా కరోనా నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే నార్త్ కొరియా మాత్రం క్షిపణీ ప్రయోగాలతో బిజీగా మారింది. మరోవైపు ఆ దేశం హ్యాకర్లను ప్రోత్సహిస్తూ ప్రపంచ సంపదను కొల్లగొడుతోంది. ఇప్పుడు ఎవరి నియంత్రణలో లేని బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రూపొందిన క్రిఫ్టోకరెన్సీపై నార్త్ కొరియా కన్నేసింది. క్రిఫ్టో కరెన్సీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నవారిపై హ్యాకర్లు దృష్టి…
ఉత్తర కొరియా అధ్యక్షుడు మళ్లీ పాతపద్దతికే వచ్చేశారు. అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తైన సందర్భంగా కాస్త తగ్గినట్టు కనిపించినా… ఆ తరువాత తగ్గేది లేదని కిమ్ చెప్పకనే చెప్పాడు. వారం క్రితం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి భయపెట్టిన కిమ్, మరోసారి క్షిపణీ ప్రయోగం చేసి షాక్ ఇచ్చాడు. 700 కిమీ పరిధిలోని లక్ష్యాలను చేధించగల శక్తి గలిగిన ఈ బాలిస్టిక్ క్షపణి ప్రయోగం సక్సెస్ అయినట్టు ఉత్తర కొరియా అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో దక్షిణ కొరియా…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన పార్టీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడం, గ్రామీణాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఆహార ఉత్పత్తులను పెంచుకోవడం వంటివాటిపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్ స్టఫ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అగ్రరాజ్యం గురించి, జపాన్, దక్షిణ కొరియా గురించి ఏలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, దేశ రక్షణ విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేసిన…
ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అధికారాన్ని చేపట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ప్లీనరీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఐదురోజులపాటు ఈ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో కిమ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. దేశాన్ని అర్థికంగా బలోపేతం చేసేందుకు బలంగా కృషిచేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కరోనా కారణంగా దేశ సరిహద్దులను మూసివేశారు. దేశంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. Read: తెలంగాణలో…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కు సంబంధించి ఎలాంటి న్యూస్ అయినా సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. గత కొన్ని నెలలుగా కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే మీడియాలో ఆయన కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నార్త్ కొరియా అధికారులు ఖండిస్తూ వస్తున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా కిమ్ సన్నబడిపోయారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ది నేషనల్ ఇంటిలిజెన్స్ సర్వీసెస్ ఏజెన్సీ కీలక వివరాలను వెల్లడించింది. కిమ్…
కరోనా, అంతర్జాతీయ ఆంక్షలతో ఉత్తర కొరియా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సరిహద్దులు మూసివేయడంతో చైనా, రష్యా నుంచి దిగుమతులు ఆగిపోయాయి. దీంతో దేశంలో ఆహారం కొరత తీవ్రస్థాయికి చేరుకున్నది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ తగినంతగా లేకపోవడంతో కొరత పెరిగిపోతున్నది. దేశ రక్షణకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజల రక్షణ, ఆహార ఉత్పత్తికి ఇవ్వలేదని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇక, నార్త్ కొరియాలో ఆహార సమస్య తీవ్రంగా ఉందని ఐరాస మానవ హక్కుల సంఘం నివేదిక ఇచ్చింది. ఈ…
ఉత్తర కొరియాలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అక్కడి ప్రజలు తీవ్రమైన ఆకలి, పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐరాస మానవహక్కుల ప్రత్యేక ప్రతినిధి క్వింటానా నివేదిక పేర్కొన్నది. ఈ నివేదికపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ విరుచుకుపడ్డారు. క్వింటానా నివేదిక ద్వేషపూరితమైన అపవాదుగా ఉందని, తమ దేశంలోని వాస్తవ పరిస్థితులు, ప్రజల జీవన విధానం తెలియకుండా నివేదికలు తయారు చేస్తున్నారని, మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశం తీసుకున్న స్వీయరక్షణ ఏర్పాట్లను పేర్కొన్నారని కిమ్ విమర్శించారు. తాము ఈ నివేదికను గుర్తించడం…
సాధారణంగా చాలా దేశాల్లో మహిళలు వారికి తెలియకుండానే లావు పెరుగుతుంటారు. ఎంత ప్రయత్నం చేసినా తగ్గినట్టే తగ్గి మరలా లావు పెరిగిపోతుంటారు. దీనికి కారణం ఫుడ్. కొంతకాలం పాటు సమతుల్య ఆహారం తీసుకొని ఆ తరువాత ఇష్టం వచ్చిన ఆహారం తీసుకుంటూ ఉంటారు. డైట్ మెయింటెయిన్ చేయరు. దీంతో తెలియకుండానే బరువు పెరడగంతో పాటుగా అనవసరంగా రోగాలు కొని తెచ్చుకుంటారు. అయితే, కొరియాలో మహిళలు అస్సలు లావుగా కనిపించరు. పడుచు పిల్లలనుంచి ముసలివాళ్ల వరకు కొరియా దేశంలో…