ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం తప్పితే చర్చలు లేవని చెప్పే కిమ్ నోటివెంట చర్చలమాట వచ్చింది. చర్చలకైనా, యుద్ధానికైనా సిద్దంగా ఉండాలని కిమ్ తన సేనలతో చెప్పినట్టు కొరియా అధికారిక మీడియా ప్రకటించింది. దీనిపై అమెరికా సానుకూలంగా స్పందించింది. కమ్ వ్యాఖ్యలు ఆసక్తికరమైన సంకేతంగా భావిస్తున్నామని, అయితే, అణ్వాయుధాలను త్యజించే అంశాలపై కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి నేరుగా సంకేతాలు వచ్చేవరకు ఎదురు చూస్తామని అమెరికా పేర్కొన్నది.
Read: హరి హర వీరమల్లు: నిధి ట్విస్ట్ అదిరిపోతుందట!
తప్పకుండా ప్యాంగ్యాంగ్ నుంచి ఆ విధమైన సంకేతాలు రావొచ్చని నిపుణులు కూడా అంచనావేస్తున్నారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత, కొరియా ద్వీపకల్పంలో శాంతిని తీసుకొచ్చందుకు, ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వైరంను తగ్గించి శాంతియుత వాతావరణం ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు వైట్‌హౌస్ ప్రతినిధులు గతంలో పేర్కొన్నారు. కానీ, ఉత్తరకొరియా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గతవారం కొరియా సీనియర్ నాయకుల సమావేశంలో కిమ్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి కొరియాలో శాంతిని తీసుకొచ్చే అంశంపై అమెరికా సానుకూలంగా స్పందించింది.