ఉత్తర కొరియాలో నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించకుంటే శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. అయితే గత కొంతకాలంగా దక్షిణ కొరియా కల్చర్‌ను ఉత్తర కొరియా యువత ఫాలో అవుతున్నది. దక్షిణ కొరియా స్టైల్‌ను, ఫ్యాషన్‌ను, వారు మాట్లాడే విధంగా మాట, యాసలు అలవరుచుకుంటున్నారు. ఇలా చేయడం వలన ఉత్తర కొరియా సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతింటాయని, యువత పక్కదోవ పడుతున్నారని భావించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియా మాదిరిగా డ్రెస్ చేసుకున్నా, వారి యాసలో మాట్లాడినా జైలు శిక్ష విధిస్తామని హెచ్చిరించింది. దక్షిణ కొరియాకు చెందిన కంటెంట్‌ను రహస్యంగా వీక్షించిన వారికి 15 ఏళ్లపాటు జైలు శిక్ష విధిస్తామని చెప్పడంతో యువతలో భయాందోళనలు నెలకొన్నాయి.
Read: రివ్యూ : నారప్ప