బీజేపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం 11.15 గంటలకు రాజేంద్రనగర్‌లోని తహసీల్దార్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
చేవెళ్లలో బిజెపి జెండాను ఎగరవేస్తానన్నారు ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన చేవెళ్ల నియోజకవర్గం లో పర్యటించారు. చేవెళ్ల మండలంలోని పామెన, కందవాడ, పల్గుట్ల, మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజలందరి సమస్యను పరిష్కరిస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం…
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ, మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఏమి చేయలేదని దుష్ప్రచారాలు చేశారు కేసీఆర్ అంతా మేమే ఇస్తున్నామని దుష్ప్రచారం చేశారన్నారు. ఉచిత బియ్యం కూడా నేనే ఇస్తున్నానని ప్రచారం చేశాడు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. రైతులకు మద్దతు ధర నేనే పంపిస్తాను అన్నాడని, స్థంబాలకు లైట్ బుగ్గలు నేనే ఇస్తున్న అన్నాడు…
మోడీ మీద నమ్మకంతో బీజేపీ చేవెళ్లలో భారీ మెజారిటీతో గెలుస్తుందని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. చేవెళ్లలో తమ ఫస్ట్ రౌండ్ ప్రచారం అయిపోయిందని పేర్కొన్నారు. చేవెళ్లలో సర్వే చేయించాం.. గెలిచేది బీజేపీయేనని అన్నారు. చేవెళ్ల సీటు మోడీదే.. ఇది రాసి పెట్టుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీపై దుష్ప్రచారం జరుగుతోందని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా అన్నారు.. లిక్కర్ కేసులో…
భారత్ జీడీపీ గ్రోత్ 8.4 శాతం ఇది శుభవార్త అన్నారు బీజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మోడీతో మంచి సంబంధాలు పెట్టుకున్నారన్నారు. ఈ ప్రభుత్వం అసెంబ్లీ లో హుందాగా వ్యవహరించింది… బూత్ లు మాట్లాడలేదన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుంది అంటే మోడీ ప్రభుత్వం వల్లనే అన్నారు. ఈ ప్రభుత్వం 9 వేల కోట్లు అప్పులు తెచ్చుకునేందుకు సహకరించిందన్నారు. తెలంగాణ లో కరెంట్, ఇల్లు ,రోడ్లు, అభివృద్ది అన్ని…
పరిగి హైవే ఇచ్చింది మోడీ అని, ఎరువుల నుంచి శ్మశానం వరకు అన్ని మోడీ ఇచ్చినవేనన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిప్ప పెట్టిపోయిండు, ఇప్పుడు ఈయన చిప్ప పట్టుకుని తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఇటీవల 9 వేల కోట్ల అప్పు మోడీ ఇచ్చారని, దిక్కులేని పార్టీలు, దిక్కు లేని సిద్ధాంతాలు ఉన్నాయన్నారు రేవంత్ రెడ్డి. మోడీకి పొత్తులు అవసరం లేదని, తెలుగు భాషను మార్చిన వ్యక్తి మోడీ. తెలుగు…
దేశంలో రాజకీయ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ 3.0 ప్రభుత్వం రాబోతుందన్నది ఖాయం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు గత 9.5 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో సాధించిన మహత్తర విజయాలు అందరూ చూడదగినవేనన్నారు. దీనికి విరుద్ధంగా, పాత పార్టీ కాంగ్రెస్‌కు ఇది క్రమంగా క్షీణించిందని, ఇది దిక్కులేని, దృష్టిలేనిదిగా మారిందని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్టీ టికెట్…
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదు అయింది. మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై దుర్భాషలాడిన ఘటనలో ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టారని.. బెదిరింపులకు పాల్పడినట్లు మాజీ ఎంపీ ఆరోపించారు.
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం ఫోన్ చేసి దిగజారుడు మాటలు మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన మనుషులను ఎలా కలుస్తారని కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి రంజిత్ రెడ్డి అడిగారు. దీంతో స్పందించిన విశ్వేశ్వర్ రెడ్డి నీకు దమ్ముంటే నా వాళ్లను తీసుకెళ్లు అని కౌంటర్ ఇచ్చారు. ఇరువురి మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో..…