ఆయనో మాజీ ఎంపీ. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా.. భవిష్యత్ ప్రయాణం ఏంటో వెల్లడించలేదు. కాసేపు అటు.. మరికాసేపు ఇటు అన్నట్టు ఆయన ట్వీట్లు ఉంటున్నాయా? ఇంతకీ ఆయన ఆ గట్టున ఉంటారా.. ఈ గట్టున రిలాక్స్ అవుతారా? క్రాస్‌రోడ్స్‌లోనే ఉండిపోయారా? కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. టీఆర్‌ఎస్‌లో ఉండగా.. చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో రాజకీయంగా లక్ కలిసి రాలేదు. ఇక అక్కడ ఉండటం అవసరం లేదనుకున్నారో…
మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ తర్జన భర్జన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల.. వచ్చేవారం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇదే ఊపులో మరిన్ని చేరికలు బీజేపీ తెరలేపుతోంది.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ఏ పార్టీలో చేరలేదు.. ఏ పార్టీలో చేరాలన్నదానిపై కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని తన రాజీనామా సందర్భంగా వెల్లడించారు.…
ఈటల రాజేందర్ తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ భేటీ అయ్యారు. ఈటల రాజేందర్ బిజేపిలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరామ్ ఈటల నివాసంలో ఆయనతో సమావేశం అయ్యారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణతో పాటు నిర్ణయంపై చర్చించినట్లు సమాచారం. ఈటల బిజేపిలో చేరుతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ కి ప్రాధాన్యత సంతరించుకుంది. సిఎం కెసిఆర్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడగట్టే యోచనలో…