మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తన రెండో కొడుకు విశ్వజిత్ పెళ్లికి ఆహ్వానించడానికి ప్రధాన మంత్రి మోదీ కలిశామన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తనను ప్రధాని మోడీ ఎంతో ఆప్యాయంగా పలకరించారని ఆయన అన్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని చెరువు కట్ట సమీపంలో ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్టంలో తండ్రి కొడుకుల అరాచక పాలన కొనసాగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ మాటలు విని కరీంనగర్ జిల్లా అభివృద్ధి అయింది అనుకున్నానని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏం చేసిండో ప్రజలకు చెప్పలేక వేరే రాష్ట్రాలలో పర్యటనలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యే…
Konda Vishweshwar Reddy : కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. ఇటీవలే బీజేపీ కండువా కప్పుకొన్న చేవెళ్ల మాజీ ఎంపీ. కొత్త పార్టీలో చేరడం ద్వారా తన దృష్టి చేవెళ్ల లోక్‌సభ సీటుపై ఉందని చెప్పకనే చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తారని.. ఆ మేరకు బీజేపీ నుంచి హామీ లభించిందని అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇక్కడే బీజేపీలో పంచాయితీ మొదలైంది. కొండా రాకపై పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. చేవెళ్ల లోక్‌సభ సీటుపై…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ తర్వాత తెలంగాణలో వరస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. హైదరాబాద్‌లో మీటింగ్స్ ముగిసిన 24 గంటల్లోనే మూడు కమిటీలు ప్రకటించి తమ దూకుడేంటో తెలియజెప్పారు. వీటిల్లో చేరికల కమిటీ పెద్ద చర్చకే దారితీస్తోంది. మొన్నటి వరకు ఆ చేరికల కమిటీకి బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి నేతృత్వం వహించారు. తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సారథ్యంలో చేరికల కమిటీని సిద్ధం చేసింది ఢిల్లీ నాయకత్వం.…
బీజేపీ అనుకూల ప్రకటనలు… కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఆయన స్టైల్. రేవంత్ అంటే వ్యతిరేకత లేదంటారు. కానీ హస్తం పార్టీలో మాత్రం చేరలేదు. చివరికి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఊరించి, ఊరించి కమలం జెండా వైపు మొగ్గిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా బీజేపీనే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్య ఉన్న బంధం ఏమిటనేది తెలియదు కానీ, పిసిసి…
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం మరోసారి తెరపైకి వచ్చింది.. గత కొంతకాలంగా విశ్వేశ్వర్‌రెడ్డి చేరికపై వార్తలు వస్తూనే ఉన్నాయి.. అధిష్టానం నుంచి పెద్ద లీడర్లు ఎవరు రాష్ట్రానికి వచ్చినా.. ఆయన సమక్షంలో కొండా బీజేపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగుతూ వచ్చింది.. ఈ మధ్య పాదయాత్రలో ఉన్న బండి సంజయ్‌ని కలిశారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో.. ఆయన బీజేపీలో చేరడం…
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. మాజీ ఎంపీ. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానంతో 2013లో గులాబీ కండువా కప్పుకొన్న విశ్వేశ్వర్‌రెడ్డి.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నాటకీయ పరిణామాల మధ్య టీఆర్ఎస్‌కు రాజీనామ చేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగినా 13వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోనూ ఉక్కపోత ఫీలయ్యారు విశ్వేశ్వర్‌రెడ్డి. 2021 మార్చిలో హస్తంపార్టీకి…