టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం కోసం కాంగ్రెస్ అధిష్టానం గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ కసరత్తులు చేసింది. చాలా టైం తీసుకొని మరీ కొత్త పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించింది. అయితే టీపీసీసీ పదవి తనకే దక్కుతుందని మొదటి నుంచి ఆశపడి భంగపడ్డ కోమటిరెడ్డి మాత్రం రేవంత్ నాయకత్వాన్ని ఒప్పుకునే సమస్యే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీలుచిక్కినప్పుడల్లా రేవంత్ పై విమర్శలు చేయడంతోపాటు టీపీసీసీ నిర్ణయాలను ధిక్కరిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి సవాల్ విసురుతున్నారు. ఈ…
కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది.. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు.. దీంతో ఎవరికి తోచినట్టు వారు చేసేస్తుంటారు.. అయితే, కాంగ్రెస్ పార్టీలో తాజా పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… పార్టీలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని.. రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి ముగ్గురు ముఖ్యమేనని మీడియా చిట్‌చాట్‌లో అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి, పీసీసీ కొత్త కమిటీకి గ్యాప్ ఉందని.. కాకపోతే అందరం కలిసి పని చేయాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. ఇక,…
ఈ రచ్చ ఇప్పటిది కాదు… రెండు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. వివాదం కొలిక్కి వస్తుందనుకుంటే… మళ్లీ మొదటికొచ్చింది. టీ కాంగ్రెస్ లో జరుగుతున్న లేటెస్ట్ రచ్చకు కారణమేంటి? తెలంగాణ కాంగ్రెస్ లో… ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిల మద్య ఒకప్పుడు మంచి మైత్రి ఉండేది. కానీ… రేవంత్ చీఫ్ అయ్యాక సీన్ మారింది. కోమటిరెడ్డి…రేవంత్ మద్య గ్యాప్ పెరిగింది. పిసిసి నియామక సమయంలో టీడీపీ నుండి…
తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ కోమటిరెడ్డి వెంకటె రెడ్డి కలకలం తీవ్రమవుతోంది. పీసీసీ ఆదేశాలను పట్టించుకోకుండా ఆయన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లడం.. ఆ తర్వాత పీసీసీపైనే.. నిద్రపోతోందా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించడం చూస్తుంటే.. ఆయన తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధమైనట్టు కనిపిస్తున్నారు. కాకుంటే.. తనకు తానుగా కాకుండా.. పార్టీనే స్వయంగా వెళ్లగొట్టేలా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే.. కోమటిరెడ్డి మొదటి నుంచీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పుడు.. ఆ…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై.. మాజీ ఎంపీ మధు యాష్కీ ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి… ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ మరియు సోనియా గాంధీ కారణమని చురకలు అంటించారు. పార్టీ నిర్ణయం కాదని సమ్మేళనం కి వెళ్ళటం పార్టీని నష్ట పర్చడమేనని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా విజయమ్మ చేసిన వ్యాఖ్యలు కోమటిరెడ్డి సమర్ధిస్తారా..? అని నిలదీశారు. కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లాలని అనుకుంటే వెళ్లొచ్చని… కానీ పార్టీ…
వైఎస్ విజయమ్మ నేతృత్వంలో నిన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంస్మరణ సభకు తెలంగాణ మరియు ఏపీ నుంచి కీలక రాజకీయ నేతలు వచ్చారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినేట్ లో పనిచేసిన మంత్రులు ఈ సభకు హజరయ్యారు. ఇందులో భాగంగానే… కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సంచలన వ్యాఖ్యలు చేశారు.…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయ మహామహులకు కేంద్రం. అందులో ఎవరు.. ఎప్పుడు.. ఎలా స్పందిస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. తమకు అనుకూలంగా రాజకీయపరమైన పరిణామాలు ఎలా క్రియేట్ చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా.. ఈ టాపిక్ కు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కారణం అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తీవ్రంగా వ్యతిరేకించి.. భంగపడి.. చివరికి పీసీసీ పోస్టు అమ్ముడుపోయిందని సంచలన ఆరోపణలు చేసి.. ఇప్పటి వరకూ రేవంత్…
యాదాద్రి జిల్లా తుర్కపల్లి(మ) రాంపూర్ తండా దళిత – గిరిజన దండోరా దీక్ష లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడో, బలహీన వర్గాలకు చెందిన వాళ్లే ముఖ్యమంత్రి. వాసాలమర్రి కి సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చిన అడ్డుకుంటాం. దళిత బంధుతో ముఖ్యమంత్రి కేసీఆర్ బొంద తొడుకుండు ఆ బొంద మేమే పుడుస్తాం. సీఎంఓ రాహుల్ బోజ్జ చోటు ఇవ్వగానే దళితలందరికి ఇచ్చినట్టా అని ప్రశ్నించారు.…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఉప్పు నిప్పులా ఉన్న ఆ ఇద్దరు నాయకుల మధ్య దోస్తీ సాధ్యమా? ఆ ఇద్దరినీ కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? కుస్తీకే ప్రాధాన్యం ఇచ్చి.. ఎవరి ఎత్తుగడలు వారు వేస్తారా? అందరి ఫోకస్ ఆ ఇద్దరిపైనే ఎందుకు ఉంది? రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు! తెలంగాణ కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా పేరుతో జనంలోకి వెళ్తోంది. ఇంద్రవెల్లి నుండి ప్రారంభమైన దండోరా.. ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో మరో సభకు…
ఇంద్రవెల్లిలో దళిత ఆత్మగౌరవ దండోరా సభ పేరుతు భారీ బహిరంగ సభ నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది… ఇక, దానికి కొనసాగింపుగా… తర్వాత సభ ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం వేదికగా నిర్వహిస్తామంటూ… ఇంద్రవెల్లి సభ వేదికగా ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… అయితే, ఇప్పుడా సభను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ… ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభను రద్దు చేసిన టి.పీసీసీ.. మహేశ్వరం…