దటీజ్ టీ కాంగ్రెస్.. అదంతే.. అలాగే ఉంటుంది.. మళ్లీ ప్రూవ్ అయ్యింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయ మహామహులకు కేంద్రం. అందులో ఎవరు.. ఎప్పుడు.. ఎలా స్పందిస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. తమకు అనుకూలంగా రాజకీయపరమైన పరిణామాలు ఎలా క్రియేట్ చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా.. ఈ టాపిక్ కు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కారణం అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తీవ్రంగా వ్యతిరేకించి.. భంగపడి.. చివరికి పీసీసీ పోస్టు అమ్ముడుపోయిందని సంచలన ఆరోపణలు చేసి.. ఇప్పటి వరకూ రేవంత్ కు సహాయ నిరాకరణ చేస్తూ వచ్చిన కోమటిరెడ్డి.. తాజాగా చేసిన చర్యతో.. మరోసారి తనలోని ఫైర్ బ్రాండ్ ను బయటపెట్టారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి.. కోమటిరెడ్డి హాజరయ్యారు. భేటీకి పార్టీ నేతలు ఎవరూ హాజరుకావద్దని స్వయానా.. కాంగ్రెస్ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా.. ఆయన ఏ మాత్రం ఖాతరు చేయలేదు. సరికదా.. పార్టీని అధికారంలోకి తెచ్చిన నేత వైఎస్ అనీ.. అలాంటి నాయకుడి పేరిట ఏర్పాటు చేసిన సమ్మేళనం విషయంలో పీసీసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. మరోవైపు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పార్టీ సమావేశాలకు, సభలకూ దూరంగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి సభకు రాలేనని చెప్పి కొన్నాళ్ల క్రితం.. తన ఆలోచనలను స్పష్టంగా బయటపెట్టారు. ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని మరోసారి వినియోగించుకున్నారు. కచ్చితంగా వెళ్తానని చెప్పి మరీ.. వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లి.. దివంగత సీఎంపై తన అభిమానాన్ని చాటుకున్నారు.
Also Read
పనిలో పనిగా.. రేవంత్ రెడ్డిపై తన ఆగ్రహాన్ని ప్రత్యక్షంగా బయటపెట్టారని పార్టీ నేతలంతా అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఎలా స్పందిస్తుంది.. ఎప్పటిలానే కోమటిరెడ్డిని లైట్ తీసుకుంటుందా? లేదంటే షోకాజ్ నోటీసు జారీ చేస్తుందా? అసలు ఆయన భవిష్యత్తును కాంగ్రెస్ ఎలా నిర్ణయిస్తుంది? కాంగ్రెస్ నాయకత్వం ఏమైనా ఆదేశాలిస్తే.. ఆయన ఎలా స్పందిస్తారు? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇదే సమయంలో.. రాజకీయ విశ్లేషకుల మాటెలా ఉన్నా.. సామాన్యులు మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ.. అలాగే ఉంటుంది.. అంతా తన్నుకుంటారు.. మళ్లీ కలిసిపోయినట్టుగా వేదికలపై కూర్చుంటారు.. మనం చూస్తూ ఉండాలి.. అదంతే.. అని నిట్టూరుస్తున్నారు.
తాజావార్తలు
-
Smuggling Racket: విజయవాడ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్.. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
-
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమేనా? శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే
-
Explainer: ఆలస్యంగా నిద్రపోతున్నారా?
-
Marco Rubio: భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌తో అమెరికా సంబంధాలుండవు.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
-
AP SEC Meeting: సుప్రీంకోర్టు ఆదేశాలతో అలర్ట్.. ఎస్ఈసీ అత్యసర సమావేశం..!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!