యాదాద్రి భువనిగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో వాల్ పోస్టర్లు కలకలం పేరుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలసాయి.
read also: Nandyala TDP Politics : ప్రత్యర్థుల పోరుకంటే వాళ్లకు వాళ్లే విమర్శించుకుంటున్నారా..?
మునుగోడు నిన్ను క్షమించదు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వ్యతిరేకిస్తూ నిన్న రాత్రికి రాత్రే మున్సిపల్ కేంద్రంలో వాల్ పోస్టర్లు ప్రత్యక్షమవడంతో.. తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 22వేల కోట్ల కాంట్రాక్టుల కోసం 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్మకున్న ద్రోహివి అంటూ.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాను కలిసి బేరమాడిన నీచుడివంటూ ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఇంతకూ ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారన్నది తేలాల్సి ఉంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా.. ఆగస్టు 8న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాను ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను నిమిషాల్లోనే అసెంబ్లీ స్పీకర్ ఆమోదం తెలిపి, అధికారికంగా స్పీకర్ కార్యాలయం ప్రకటించిన విషయం తెలిసిందే. రాజీనామా స్పీకర్ తనకు అందిన వెంటనే ఆమోదించడంతో ఇది హాట్ టాప్ గా మారింది. రాజగోపాల్ రెడ్డి స్పీకర్ కు రాజీనామా ఇచ్చి బయటకు వచ్చిన కొద్దినిమిషాలకే స్పీకర్ ఆమోదం తెలపడంతో పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. దీంతో మునుగోడు ఎన్నికలు ఖాయమైన వేల రాజగోపాల్ రెడ్డి పై పలు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
Union Minister Jitendra Singh: స్టార్టప్స్ లో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఇండియా