Kolkata: గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని మాయం చేద్దామనుకున్న ఇద్దరు లేడీస్ అనూహ్య రీతిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ సంఘటన కోల్‌కతాలో మంగళవారం జరిగింది. సూట్‌కేస్‌లో శవాన్ని తీసుకువచ్చిన ఇద్దరు మహిళలు, నగరంలోని కుమార్తులి సమీపంలోని గంగా నది ఘాట్‌లో పారేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, రోజూ వారీ యోగా సెషన్‌కి వచ్చే వారు వీరిని పట్టుకున్నారు. సూట్‌కేస్‌లో మృతదేహాన్ని చూసి ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు.
ఆర్జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య కేసులో సంజయ్ రాయ్‌కు ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా కలకత్తా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. సంజయ్‌రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లలో కోరాయి.
West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా లెదర్ కాంప్లెక్స్‌లో మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తుండగా కాలువలో పడి ముగ్గురు కార్మికులు ఆదివారం మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.
Student Suicide: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో గల ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పేరు గత కొంత కాలం నుంచి మారుమ్రోగుతుంది. తాజాగా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కమర్హతిలోని ఈఎస్ఐ క్వార్టర్స్ లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కి శిక్ష ఖరారైంది. కోల్‌కతాలోని సీల్దా కోర్టు అతడికి జీవిత ఖైదును విధించింది. అయితే, ఈ కేసును ఈరోజు (జనవరి 22) మరోసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. కాగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై…
IND vs ENG: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భారత్ పోటీ పడబోతుంది. ఇందులో భాగంగా ఈ రోజు (జనవరి 22) ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మొదటి మ్యాచ్ జరగబోతుంది.
Kolkata Hospital Case : ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో సంజయ్ రాయ్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. శనివారం ఈ కేసులో సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది.
కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ ను కోర్టు దోషీగా తేల్చింది. ఏ కారణం లేకుండా నన్ను ఈ కేసులో ఇరికించారు అని నిందితుడు సంజయ్ రాయ్ పేర్కొన్నాడు.
Kolkata Doctor Case: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై 2024 ఆగస్టు 9వ తేదీన పోలీసు వాలంటీర్ గా పని చేస్తున్న సంజయ్ రాయ్ దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది.